కాజల్ అగర్వాల్ అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాజల్ మంగళవారం ఏప్రిల్ 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ విషయంపై కాజల్ అగర్వాల్ ఇంకా అధికారకంగా స్పందించలేదు. మొదట్లో ఆమె ప్రెగ్నెన్సీ విషయంపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ తర్వాత రూమర్స్ కు చెక్ పెట్టేందుకు తన భర్తతో కలిసి దిగిన పిక్స్ షేర్ చేసింది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి రఘువీరా రెడ్డికి KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏమవుతాడు?
తాజాగా తన భర్తకు ఓ నోట్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఈ ఎనిమిది నెలలు వారి మధ్య పెరిగిన బాండింగ్, తన భర్త ఓ గొప్ప తండ్రి అవుతాడనే ఆశాభావాన్ని వ్యక్త పరిచింది. డెలివరీ డేట్ దగ్గరపడుతుండటంతోనే ఆ నోట్ పెట్టిందని కూడా కొందరు భావిస్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో, బీ టౌన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రమే కానీ, కాజల్ భర్త, కుటుంబసభ్యులు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ఇటు కాజల్ అభిమానులు మాత్రం సంబరపడిపోతున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.