ఈ పాపని చూడగానే భలే క్యూట్ గా అనిపించి ఉంటుంది. ప్రస్తుతం హీరోయిన్ గా ఆలోవర్ ఇండియాలో ఫేమస్ అయిపోయింది. యమ హాట్ గా ఉంటుంది. ఎవరో కనిపెట్టారా?
ఈ హీరోయిన్, ఓ పిల్లకు తల్లంటే మీరు నమ్ముతారా? అస్సలు ఛాన్సే లేదని మాతో వాదిస్తారు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్లకు పైగా అయిపోయిందని చెబితే కచ్చితంగా అవాక్కవుతారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ సేమ్ అలానే మెంటైన్ చేస్తూ వస్తోంది. 90స్ కుర్రాళ్లందరికీ ఈమె డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. ఇప్పటికీ ఈమెని చూసినప్పుడల్లా తెగ మెలికలు తిరిగిపోతూ ఉంటారు. ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్ లోని హరిద్వార్ లో పుట్టింది. మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకుని పలు యాడ్స్ లో కనిపించింది. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తో కలిసి యాక్టింగ్ కోర్సు చేసింది. అలా తెలుగు డైరెక్టర్స్ కంట్లో పడింది. 2001లో ‘ఇష్టం’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే శ్రియ శరన్. అప్పటి నుంచి మొదలుపెడితే మొన్నమొన్న వచ్చి ‘కబ్జ’ వరకు ఆలోవర్ ఇండియా దాదాపు ఐదారు భాషల్లో యాక్ట్ చేసి ఫేమ్ తెచ్చకుంది. స్టిల్ ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు పోటీఇస్తూ సినిమాలు చేస్తూనే ఉంది.
ప్రస్తుతం ‘మ్యూజిక్ స్కూల్’ మూవీ చేస్తున్న ఈ బ్యూటీ.. 2018లో కెరీర్ పరంగా కాస్త డౌన్ అయిన టైంలో ఆండ్రూ కొశ్చివ్ అనే ఫారెనర్ ని పెళ్లి చేసుకుంది. లాక్ డౌన్ టైంలో ఓ పాపకి జన్మనిచ్చింది. కానీ ఆ విషయాన్ని ఏడాదిన్నర తర్వాత బయటపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు శ్రియని చూస్తున్న ఎవరైనా సరే ఒక్కటే ఒక్కటి అంటారు. అసలు ఈ రేంజ్ ఫిజిక్ ని ఎలా మెంటైన్ చేస్తుందబ్బా అని అనుకోని అబ్బాయి, అమ్మాయిగానీ ఉండదు. ఇప్పుడామె చిన్నప్పటి ఫొటో ఒకటి బయటకు రావడంతో అప్పుడు చాలా క్యూట్ గా ఉంది గానీ ఇప్పుడు మాత్రం యమ హాట్ అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.