యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. సినిమాలు, కుటుంబం ఇదే లోకం. ఏమాత్రం సమయం దొరికిన ఫ్యామిలీతో గడపడానికి రెడీ అవుతారు. ఇక సోషల్ మీడియాలో చాలా రేర్‌గా పోస్ట్‌లు చేస్తుంటారు. ఇక తాజాగా ఆయన చేసిన పోస్ట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
నందమూరి ఎన్టీఆర్ మనవడిగా ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో.. ఆయన క్రేజ్ ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఎదిగింది. ప్రస్తుతం జూనియర్ చేతిలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ 30 షూటింగ్ ప్రారంభం అయ్యింది. జాన్వి కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు కావడంతో.. వీటిపై ఇప్పటి నుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. కెరీర్ సంగతి పక్కకు పెడితే.. టాలీవుడ్‌లో ఫ్యామిలీ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. జూనియర్-లక్ష్మీ ప్రణతిలు టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్, క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.
ఇక జూనియర్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు భార్య ప్రణతి, పిల్లలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటారు. నేడు ప్రణతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా భార్యకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. జూనియర్ తన భార్యను ముద్దుగా ఏ పేరుతో పిలుస్తాడో ఈ సందర్భంగా వెల్లడించాడు. ప్రణతి బర్త్‌డే సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అమ్ములు అంటూ ప్రేమగా విషెస్ చెప్పాడు జూనియర్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది.
జూనియర్-ప్రణతిలకు 2011 మే 5న వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అభయ్ రామ్, భరత్ రామ్. లక్ష్మి ప్రణతి చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. టాప్ స్టార్ వైఫ్ అయినప్పటికీ చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న దాఖలాలు లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ పోస్ట్‌లు చేయరు. ఎన్టీఆర్‌తో పాటు చాలా అరుదుగా బయటకు వస్తారు. కుటుంబం, పిల్లలు ఇదే తన ప్రపంచం అన్నట్లు ఉంటారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ గ్లోబల్ ప్రమోషన్స్ సందర్భంగా ఎన్టీఆర్‌తో కలిసి విదేశాల్లో సందడి చేశారు ప్రణతి. బర్త్‌డే సందర్భంగా నందమూరి అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.