టాలీవుడ్ లో నందమూరి హీరోలకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా జూనియర్ యన్టీఆర్ అంటే మాస్ ఫ్యాన్స్ విపరీతమైన అభిమానం చూపిస్తూ ఉంటారు. కానీ.. తారక్ మాత్రం సుమారు నాలుగేళ్లుగా ట్రిపుల్ ఆర్ కోసం లాక్ అయిపోయి ఫ్యాన్స్ కి ఆనందాన్ని దూరం చేశాడు. కానీ.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు పెద్దగా టైమ్ లేకపోవడంతో తారక్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఒకే ఒక్క ఫోటో యన్టీఆర్ అభిమానుల కళ్ళలో మళ్ళీ ఆనందాన్ని తెచ్చింది. తారక్ సతీమణి లక్ష్మి ప్రణతి, చిన్న కుమారుడు భరత్ రామ్‌కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
ఈ ఫొటోలో ప్రణతి కొడుకు భరత్ రామ్ ఎత్తుకుని, కిడ్స్ గేమ్ జోన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో వైరల్ కావడంతో ఇలా అయినా.. తమ అభిమాన హీరో తనయుడిని చూశాం అంటూ అభిమానులు ఆనందపడుతున్నారు. మిగతా హీరోలలా తారక్ తన ఫ్యామిలీని అంతగా కెమెరాల ముందుకి తీసుకుని రాడు. దీంతో.. చాలా రోజుల తరువాత లక్ష్మి ప్రణతి, చిన్న కుమారుడు భరత్ రామ్ ఫొటో బయటకి రావడంతో.. ఫ్యాన్స్ ఈ పిక్ ని వైరల్ చేస్తున్నారు. మరి ఈ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.