సెలబ్రిటీలను కలవాలని, మాట్లాడాలని ఫ్యాన్స్ ఎలా కోరుకునే విధంగానే.. సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ ని మీట్ అవ్వాలని.. వారితో ఇంటరాక్ట్ అవ్వాలని ఆ సమయం కోసం వెయిట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో అయినా.. నేరుగా అయినా ఫ్యాన్స్ ని మీట్ అవ్వడం సెలబ్రిటీలకు ఇష్టమే. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన ఫ్యాన్స్ ని అమెరికాలో కలిసి.. ఎలాంటి గోల లేకుండా హ్యాపీగా వారితో ఇంటరాక్ట్ అయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అభిమాన సెలబ్రిటీలను కలవాలని, మాట్లాడాలని ఫ్యాన్స్ ఎలా కోరుకునే విధంగానే.. సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ ని మీట్ అవ్వాలని.. వారితో ఇంటరాక్ట్ అవ్వాలని ఆ సమయం కోసం వెయిట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో అయినా.. నేరుగా అయినా ఫ్యాన్స్ ని మీట్ అవ్వడం సెలబ్రిటీలకు ఇష్టమే. కాకపోతే.. కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే హడావిడి, గందరగోళం వలన.. ఆ మీటింగ్స్ ఫెయిల్ అవుతుంటాయి. కానీ.. కొన్నిసార్లు మాత్రం ఫ్యాన్స్ – సెలబ్రిటీల మధ్య ప్రశాంతమైన మీటింగ్స్ జరుగుతుంటాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన ఫ్యాన్స్ ని అమెరికాలో కలిసి.. ఎలాంటి గోల లేకుండా హ్యాపీగా వారితో ఇంటరాక్ట్ అయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మార్చి 12న జరగనున్న 95వ ఆస్కార్ వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికాలో అడుగుపెట్టిన వెంటనే.. ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ నుండి గ్రాండ్ వెల్కమ్ లభించింది. తన కోసం వచ్చి.. వెల్కమ్ చెప్పిన అభిమానులను ఎంతో ప్రేమగా పలకరించి.. వారి బాగోగులు అడిగిమరీ కాసేపు మాట్లాడాడు ఎన్టీఆర్. ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తాడో తెలిసిందే. తనను ఎంతో ఆదరించే అభిమానులను దృష్టిలో పెట్టుకునే.. ఎన్టీఆర్ ప్రతి ఈవెంట్ లో జాగ్రత్తలు చెబుతుంటాడు. అంతటి మంచితనం కలిగిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ని బాగున్నారా? అని అడిగి, సరదాగా సంభాషించడం ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తున్న విషయం.
ఇదిలా ఉండగా.. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా ఇది. గతేడాది రిలీజై పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమాలో.. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ప్రధానపాత్రలో నటించాడు. అయితే.. ఆర్ఆర్ఆర్ కి ప్రపంచ దేశాల నుండి ఊహించని పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. ఆ సినిమా నుండి నాటు నాటు సాంగ్.. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. మరి ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న ఈ పాట.. ఆస్కార్ కూడా కొడుతుందని ఎంతో నమ్మకంగా, ఆశగా ఉన్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి చేయనుంది. అందుకోసం ఎన్టీఆర్ ఇప్పుడు అమెరికా చేరుకున్నాడు. సో.. ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ ప్రేమగా ఇంటరాక్ట్ అయిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Denemmaaaaa high 🥹🥹🥹🥹 @tarak9999 Forever and ever Lov uuuu tigerrrrrrr ❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/agqmWJln5Q
— Tonieee (@Tony_1439) March 7, 2023
My life time memory 🥹🥹🥹🥹 Last time kalisindhi gurthu pettukunnadu hero @tarak9999 Venue lo ki entry avvagane na gurinchi matladadu 😭😭😭😭😭😍😍😍 pic.twitter.com/7WJkoQdpJ1
— Tonieee (@Tony_1439) March 7, 2023
My hero is always the best ❤️ pic.twitter.com/dVkVocjejU
— A. (@Anchalla3) March 7, 2023