నందమూరి వారసుడిగా, సీనియర్ హీరో హరికృష్ణ తనయుడు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1983 మే 20న జన్మించిన ఎన్టీఆర్ తన నటనతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన డాన్స్ తో.. ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
తారక్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ బంగ్లా విలువ రూ. 25 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఇంటితో పాటు బెంగళూరు, కర్ణాటకలో అనేక విలాసవంతమైన గృహాలు ఉన్నాయి. అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో ఉన్న ఈ ఖరీదైన ఇంటిని.. తారక్ తన డ్రీమ్ హౌస్‌గా భావిస్తాడట. ఈ ఇంటిని తన అభిరుచి మేరకు.. ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలో నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Srimukhi: పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ శ్రీముఖి
2001లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్న ఎన్టీఆర్ కి భార్గవ్ రామ్, అభయ్ రామ్ అని ఇద్దరు కుమారులు. ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు.. మంచి భర్త, తండ్రి కూడా. సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ఎన్టీఆర్ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాడట. ఆర్ఆర్ఆర్ తో భారీ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. తరవాత కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.