Jr NTR: మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట నేపథ్యంలో ఇంట్లోని తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమె మరణించారు. బుధవారం ఉమామహేశ్వరి అంత్యక్రియలు జరిగాయి. అయితే, ఈ అంత్యక్రియలకు జూ.ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారు. భార్య, పిల్లలతో వెకేషన్లో ఉన్న ఆయన మేనత్త అంత్యక్రియలకు సరైన సమయానికి రాలేకపోయారు.
అయినప్పటికి గురువారం మేనత్త ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. భార్య ప్రణతి కూడా ఆయన వెంట వెళ్లారు. ఈ సందర్భంగా మేనత్త కుటుంబాన్ని జూ.ఎన్టీఆర్ దంపతులు పరామర్శించారు. వారితో పాటు జూ.ఎన్టీఆర్ సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి, ఉమామహేశ్వరి ఇంటికి Jr NTR దంపతులు వెళ్లటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
. @tarak9999 and His Wife #Pranathi at #UmaMaheshwari gari house to convey their condolences to their family. #JrNTR #SumanTV pic.twitter.com/wZAuIKKT2b
— SumanTV (@SumanTvOfficial) August 4, 2022
ఇవి కూడా చదవండి : OTT Releases: ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు!