టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూలైలో విడుదలైన సినిమాలన్నీ ఆశించిన ఫలితాలను తీసుకురాలేకపోయాయి. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కానీ.. ఏ ఒక్కటీ కనీసం ఫ్యాన్స్ ని కూడా మెప్పించలేకపోవడం గమనార్హం. కొన్ని సినిమాలు టాక్ పరంగా బాగానే ఉన్నా కలెక్షన్స్ చూస్తే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి చాలా దూరంలో ఆగిపోయాయి. అయితే.. ఇప్పుడు ఆగష్టులో రాబోతున్న సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ క్రియేట్ చేస్తాయేమో చూడాలి. ఇక ఆగష్టు మొదటి వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలలో రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి. అయితే.. ఈ వారం థియేట్రికల్ రిలీజ్ లతో పాటు ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు సైతం వీక్షకులను అలరించనున్నాయి. ఈ వారం మొత్తంగా థియేట్రికల్, ఓటిటిలు కలిపి 13 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కానున్న రెండు సినిమాలలో ఏది నిలబడుతుందో, ఏది నిరాశపరుస్తుందో చూడాలి. ఈ ఆగష్టు మొదటి వారం రిలీజ్ అవుతున్న థియేట్రికల్/ఓటిటి సినిమాలేంటో చూద్దాం! ఆగష్టు 5న థియేటర్లలో రిలీజ్ అయ్యేవి: బింబిసార సీతారామం ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేవి: అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video): ఆగష్టు 4 - కడువ ఆగష్టు 4 - ఆల్ ఆర్ నథింగ్ (వెబ్ సిరీస్) ఆగష్టు 5 - క్రాష్ కోర్స్ హిందీ సిరీస్) ఆగష్టు 5 - థర్టీన్ లైవ్స్ (హాలీవుడ్) ఆహా(Aha): ఆగష్టు 5 - పక్కా కమర్షియల్ ఆగష్టు 5 - మహా (తమిళం) నెట్ ఫ్లిక్స్(Netflix): ఆగష్టు 5 - డార్లింగ్స్ ఆగష్టు 5 - కార్టర్ (కొరియన్ మూవీ) ఆగష్టు 5 - ది సాండ్ మూన్ (వెబ్ సిరీస్) డిస్నీ హాట్ స్టార్ (Hotstar): ఆగష్టు 3 - లైట్ ఇయర్ (తెలుగు డబ్బింగ్) వూట్(Voot): ఆగష్టు 4 - ది గ్రేట్ వెడ్డింగ్ ఆఫ్ మున్నేస్ (హిందీ) ఇక ఆగష్టు మొదటి వారంలోనే థియేట్రికల్ గా, ఓటిటిలో కలిపి 13 సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సినిమా లవర్స్ కి కావాల్సినంత వినోదం దొరకనుంది. ఒకే వారంలో ఇన్ని సినిమాలు వస్తున్నాయంటే ఆడియెన్స్ తో సైతం ఈ సినిమాలపై ఆసక్తి చూపుతుంటారు. మరి ఈ వారం థియేటర్లలో, ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.