ఈమధ్య టాలీవుడ్ హీరోలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒకరి సినిమా ప్రమోషన్స్‌కు మరొకరు వస్తూ తాము ఒక్కతాటిపై ఉన్నామని చెప్పకనే చెబుతున్నారు. అలాగే ఆయా చిత్రాలపై ప్రేక్షకుల్లో హైప్ కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ఓ అక్కినేని హీరో కోసం ఒక మెగా హీరో, మరో నందమూరి హీరో రానున్నారట. మిగిలిన వివరాలు మీ కోసం..
అక్కినేని వారసుడు అఖిల్ మరో హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు. కెరీర్ మొదట్లో వరుసగా ఫ్లాప్‌లు పలకరించినప్పటికీ ఈ యంగ్ హీరో డీలాపడలేదు. రెట్టించిన ఉత్సాహంతో, మరింత కసితో సినిమాలు చేశారు. ఈ క్రమంలో 2021లో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ రూపంలో చక్కటి విజయాన్ని అందుకున్నారు. పూజా హెగ్డే-అఖిల్ మధ్య రొమాన్స్ వర్కవుట్ కావడంతో ఈ మూవీ యూత్ ఆడియెన్స్‌కు బాగా నచ్చేసింది. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌తో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కొత్త మూవీకి ఓకే చెప్పాడు అఖిల్. వీరి కలయికలో వస్తున్న సినిమానే ‘ఏజెంట్’. అయితే ఈ చిత్రం రిలీజ్‌పై అభిమానుల్లో అనుమానాలు ఏర్పడ్డాయి.
‘ఏజెంట్’ వాయిదా పడిందంటూ రూమర్స్ వినిపించాయి. దీంతో ఫ్యాన్స్ ఇది నిజమేనని అనుకున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘ఏజెంట్’ను వాయిదా వేశారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఏప్రిల్ 28న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వచ్చే నెల మొదటి వారం నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయట. ‘ఏజెంట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారట. ఈ కార్యక్రమానికి ఏకంగా గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు తరలిరానున్నారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం గ్రేట్ న్యూస్ అనే చెప్పాలి.
ఒక అక్కినేని హీరో కోసం మెగా, నందమూరి హీరోలు కలసిరావడం, ప్రమోషన్స్ చేయడం అంటే విశేషమే అవుతుంది. ఈమధ్య యువ హీరోల చిత్రాలను స్టార్ హీరోలు ప్రమోట్ చేస్తున్నారు. విశ్వక్సేన్ ‘ధమ్కీ’ ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్ వెళ్లారు. ఇప్పుడు అఖిల్‌కు మద్దతుగా మళ్లీ తారక్ వస్తున్నారని సమాచారం. మొత్తానికి హీరోలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటుండటంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. మరి.. ఒకే వేదికపై అక్కినేని, కొణిదెల, నందమూరి హీరోలను చూసేందుకు మీరు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Agent Release Date #AkhilAkkineni #SurrenderReddy #AgentLoading #RamCharan #NTR pic.twitter.com/lG5ZMGAc7g
— TeluguOne (@Theteluguone) March 20, 2023