విదేశాల్లో భారతీయులపై దాడులు జరగడం గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఎలాంటి కారణం లేకుండా ఇండియన్స్‌పై దాడి చేసే ఘటనలు అనేకం చూశాం. మా దేశానికి ఎందుకు వచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కనీసం మహిళలు అని కూడా చూడకుండా.. ఇండియన్స్‌పై దాడి చేసిన వార్తల గురించి చదివాం. బాధితుల జాబితాలో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండటం లేదు. తాజాగా ఈ కోవకు చేందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భారతీయ నటుడిపై అమెరికాలో దాడి చేశారు కొందరు దుండగులు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో.. ఇండియన్ నటుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం సదరు నటుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆ వివరాలు..
అమన్ ధలివాల్.. పేరు వినగానే గుర్తు పట్టడం కష్టం. ఇతడు జోధా అక్బర్ సహా.. పలు పంజాబీ సినిమాల్లో నటించి.. తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఇతడు అమెరికా, కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు గురువారం గ్రాండ్ ఓక్స్ ప్రాంతంలోని ఒక జిమ్‌కు ఎక్సర్‌సైజ్ చేసుకోవడం కోసం వెళ్లాడు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చి.. ధలివాల్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ధలివాల్ ఛాతీ, మెడ, తల, భుజంపై పలు చోట్ల గాయాలయ్యాయి. సదరు ఆగంతకుడు జిమ్‌లో దూరి.. అక్కడున్న వారిని బెదిరించి.. దాడి చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ధలివాల్.. ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. నిందితుడు నటుడిపై దాడి చేసినట్లు తెలిసింది.
అప్రమత్తమైన జిమ్‌లోని మిగతా వారు ఆగంతకుడని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ధలివాల్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒంటి నిండా కట్లతో ఉన్న ధలివాల్ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై ధలివాల్ కుటుంబ సభ్యులు, వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇక ధలివాల్ బాలీవుడ్, పంజాబీ, తెలుగు చిత్రాల్లో కూడా నటించాడు. జోధా అక్బర్ సినిమాలో ఇతడు రతన్ సింగ్ పాత్రలో కనిపించాడు. తెలుగులో ఖలేజా చిత్రంలో నటించాడు. ఈ ఘటనపై విదేశాల్లో ఉన్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మని దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Famous actor Aman Dhaliwal, who has worked in Punjabi and Hindi films, has been fatally attacked in America. The attack took place when he was exercising in the gym.
An assailant entered the gym armed with a knife and launched an attack. pic.twitter.com/4CgtTYJB3y— Parmeet Bidowali (@ParmeetBidowali) March 16, 2023