జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో, రాజశేఖర్ హీరోగా వస్తున్న చిత్రం ‘శేఖర్’. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో నటించింది. మే 20న సినిమా విడుదల కాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని రోజుల క్రితమే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్ తన కుమార్తెల గురించి మాట్లాడుతూ.. ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పింది. తను ఒకలాగా అంటే.. అది ఇంకో ఉద్దేశంలో ప్రచారం చేస్తున్నారని, ఏదేమైనా తన మాటలతో ఎవరి మనసైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది. అదే సమయంలో తమ కుటుంబం గురించి లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది జీవిత.
ఇంత వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ఏవంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జీవిత తన కుమార్తెల గురించి మాట్లాడుతూ.. ‘‘తాను ఆర్డర్ చేసిన ఫుడ్ సరిగ్గా లేకపోతే.. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేంతవరకు శివాని స్విగ్గీ వాళ్లని వదలిపెట్టదు.. మా అమ్మాయి కోమటిదాని లెక్క’’ అంటూ జీవిత చెప్పుకొచ్చింది. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు ఆర్యవైశ్యులని కించపరిచేలా ఉండటంతో.. ఆ సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కులానికి పిసినారితనాన్ని ఆపాదించేలా జీవిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. జీవిత వాటిపై వివరణ ఇచ్చేందుకు గురువారం మీడియా ముందుకు వచ్చారు. తాను ఎవరిని కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని.. చిన్నప్పటి నుంచి వింటున్న నానుడినే చెప్పానని అన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా కించపరిచి ఉంటే.. అందుకు క్షమాపణలు చెప్తున్నాను అని తెలిపారు. ఇక ఇదే సమయంలో తన కుమార్తెల గురించి, గరుడ వేగ సినిమా వివాదం గురించి ప్రస్తావించారు జీవిత.
ఇది కూడా చదవండి: Zee 5: బ్రేకింగ్: వెనక్కి తగ్గిన జీ5 ! ఉచితంగానే RRR మూవీ స్ట్రీమింగ్ !
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా మీద వచ్చినన్ని వార్తలు వేరేవాళ్లమీద బహుశా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందని దుష్ప్రచారం చేశారు. ఓసారి శివాత్మిక అంటారు, కాదు శివానీ ప్రియుడితో పారిపోయిందంటారు. తీరా వార్త ఓపెన్ చేస్తే ఆ శీర్షికకు, లోపల రాసున్నదానికి సంబంధమే ఉండదు. మా ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్‌కు వెళ్లాం. దానికే ప్రియుడితో దుబాయ్‌కు లేచిపోయారని వార్తలు రాశారు. ఇలా అసత్యాలు ప్రచారం చేస్తే ఎంతో మంది జీవితాలు ప్రభావితం అవుతాయి. గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో ఉంది. కోర్టులో తేలకముందే ఏదేదో చెబుతున్నారు. నిజంగా తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, ఎవరమూ కాదనం. కానీ తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయకండి’ అని ఆవేదన వ్యక్తం చేసింది. జీవిత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Sudheer: రష్మీపై మండిపడుతున్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్! ఏమైందంటే?