పండంటి ఆడబిడ్డకు ఆదివారం జన్మనిచ్చిన హీరోయిన్ ఆలియా భట్.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. హీరో రణ్ బీర్ తో పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు.. అప్పుడే అలా ఎలా? అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం బాబోయ్ అనుకుంటున్నారు. సరే ఇప్పుడు ఇదంతా పక్కనబెడితే.. తెలుగు ప్రముఖ నటుడు.. ప్రేక్షకులకు షాకిచ్చాడు. త్వరలో తండ్రి కాబోతున్నానని చెప్పాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముందని అంటారా.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీని గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ అనగానే చాలామంది టక్కున గుర్తుపట్టేస్తారు. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు.. టాలీవుడ్ లో సహాయ నటుడి పాత్రలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండకు ఫ్రెండ్ గా గుర్తుండిపోయే పాత్ర చేశాడు. ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక గతేడాది వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోగా యాక్ట్ చేశాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తను తండ్రి కాబోతున్నానని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.
రాహుల్ రామకృష్ణ ఓ అమ్మాయిని ప్రేమించాడు. హరిత అనే అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను ఈ ఏడాది మేలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. త్వరలో పెళ్లి చేసుకుంటానని అన్నాడు. కానీ మ్యారేజ్ ఎప్పుడు ఎక్కడ జరిగింది అనే విషయాలు బయటపెట్టలేదు. ఇక గత నెలలో ఆమెతో ఉన్న మరో ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇక ఇప్పుడు ట్విట్టర్ లో హరిత ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి తండ్రి కాబోతున్నట్లు రివీల్ చేశాడు. ఈ క్రమంలోనే శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్స్.. పెళ్లి ఎప్పుడయిందా బ్రో అని కామెంట్స్ పెడుతున్నారు.
Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6
— Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022
Say hi to my wife (:
The only person who understands my rage and my madness pic.twitter.com/Cs8bgJeb7b— Rahul Ramakrishna (@eyrahul) October 8, 2022
Say hello to our little friend pic.twitter.com/q7t5htIZEO
— Rahul Ramakrishna (@eyrahul) November 7, 2022