‘జగమే తంత్రం’ ఓటీటీ విడుదలపై ఎంతో ఆసక్తితో ఉన్నాడు ధనుష్. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ నటించిన ఈ చిత్రం జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘డి 40’ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళ్‌లో ‘జగమే తంతిరమ్’ పేరుతో., తెలుగులో ‘ జగమే తంత్రం’ పేరుతో విడుదల కానుంది. ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఆయన సరసన ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తుంది.భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటలకు సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చారు.గతేడాది వేసవిలోనే సినిమా మోషన్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. నటించిన ‘కర్ణన్’ సినిమా ఈ ఏడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ‘జగమే తంతిరమ్’ సినిమా కూడా థియేటర్లకు వస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ‘జగమే తందిరం’ తమిళ చిత్రం జూన్ 18న ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది. ముఖ్యంగా, ధనుష్ క్యారెక్టర్ పైన తలైవా ఇన్ ఫ్లుయెన్స్ ఉటుందట. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా హల్చల్ చేయబోతోందని వినికిడి. ఈ నిర్ణయంతో ధనుష్ కొంచెం సమాధానపడ్డాడనే చెప్పుకోవాలి. నెట్‌ఫ్లిక్స్ ద్వారా అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో ఓ వినోద మార్గంగానూ నిలుస్తుంది. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నానని చెప్పుకొచ్చాడు ధనుష్. చూడాలి మరి, జూన్ 18న ధనుష్… ఇటు తన ఫ్యాన్స్ ని, అటు మామగారు రజనీ ఫ్యాన్స్ ని… ఏక కాలంలో ఎలా అలరిస్తాడో!