‘జబర్దస్త్’ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న కతర్నాక్ కామెడీ షో. ఈ షో ద్వారా పరిచయం అయిన నటులు వెండితెరపై కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. ఇక జబర్దస్త్ షోలో ప్రత్యేకంగా చెప్పుకొవాల్సింది లేడీ గెటప్స్ గురించి. ఈ లేడీ గెటప్ ను తొలిసారిగా జబర్దస్త్ కు పరిచయం చేసింది చమ్మక్ చంద్ర. ఇక అప్పటి నుంచి లేడీ గెటప్స్ హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కు జబర్దస్త్ లేడీ గెటప్స్ ఫేమ్ శాంతి స్వరూప్, మోహన్, హరిత, సాయిలేఖలు వారి తండ్రులతో వచ్చారు. శాంతి స్వరూప్ మాత్రం తన తల్లితో క్యాష్ కు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే తన తల్లి పడ్డ కష్టాలను తలుచుకుంటూ.. ఎమోషనల్ అయ్యాడు శాంతి స్వరూప్.
తెలుగు చిత్ర పరిశ్రమలోకి తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి చాలా మంది యువతీ యువకులు వస్తుంటారు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునే క్రమంలో అనేక కష్ట, నష్టాలను వారు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఒక్కోసారి పస్తులు కూడా ఉండాల్సి ఉంటుంది. అవకాశాలు రాక, ఇంట్లో ఇబ్బందులతో సతమతమవుతుంటారు చిన్న చిన్న నటీ, నటులు. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ చేసిన క్యాష్ ప్రోమోలో తన జీవితంలో పడ్డ కష్టాల గురించి చెప్పుకుంటూ.. ఎమోషనల్ అయ్యాడు జబర్దస్త్ శాంతి స్వరూప్. తన తల్లి గురించి మాట్లాడుతూ.. తల్లితో కలిసి స్టేజిపైనే కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
జబర్దస్త్ కామెడీ షోలో పార్టీసిపేట్ చేసే లేడీ గెటప్స్ అందరూ క్యాష్ షోలో మెరిశారు. శాంతి స్వరూప్, మోహన్, హరిత, సాయిలేఖ వారి వారి తండ్రులతో ఈ షోకి హాజరైయ్యారు. ఇక ఎప్పటిలాగానే సుమ తన మార్క్ యాంకరింగ్ తో ఆకట్టుకుంది. కానీ సాయిలేఖ, హరిత వాళ్ల నాన్నల కౌంటర్లకు సుమ దగ్గర సమాధానం లేదు. ఆద్యాంతం సూపర్ కామెడీతో రచ్చ రచ్చ లేపింది ఈ ప్రోమో. ఈ నేపథ్యంలోనే శాంతి స్వరూప్ తన తల్లి పడ్డ కాష్టాల గురించి చెప్పుకుంటూ.. ఎమోషనల్ అయ్యాడు. మా అమ్మ చాలా ఇళ్లలో పని చేసేదని, అప్పుడు ఆకలి విలువ అంటే ఏటో.. మాకు తెలిసి వచ్చిందని భావోద్వేగానికి గురైయ్యాడు. ఇక మా అమ్మకు చిన్నతనం నుంచి గొంతు సరిగ్గా రాదని, స్పష్టంగా మాట్లాడలేదని.. ఏదో మాట్లాడాలనుకుటుంది కానీ మాట్లాడలేదు. అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే శాంతి స్వరూప్ గురించి తల్లి సరోజనమ్మ మాట్లాడుతూ..”నా కొడుకే నన్ను బతికిస్తున్నాడు. ఆస్పత్రుల చూట్టు తిప్పుతున్నాడు” అని కన్నీటి పర్యంతమైంది. దాంతో సుమతో పాటు షోకి వచ్చిన వారంతా భావోద్వేగానికి లోనైయ్యారు.