కిరాక్ ఆర్పీ.. ఈ పేరుతో బుల్లితెర ప్రేక్షకులకు చాలా పెద్ద అనుబంధమే ఉంది. జబర్దస్త్ షోతో కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టాడు. తనదైన స్లాంగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు కిరాక్ ఆర్పీ. తనకంటూ ప్రత్యేక మ్యానరిజం క్రియోట్ చేసుకున్నాడు. కిరాక్ ఆర్పీ వెండితెరపై కూడా చాలా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ లో కొనసాగుతున్నాడు. అయితే బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎంతో సెలబ్రిటీలు తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించడం చూస్తున్నాం. అలాగే కిరాక్ ఆర్పీ కూడా తన సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అందులో తన హోమ్ టూర్ చేశాడు. చూడగానే మతిపోయే రేంజ్ లో ఉంది కిరాక్ ఆర్పీ హోమ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.