Praveen: ప్రముఖ కామెడీ షో జబర్థస్ కమెడియన్, నటుడు ప్రవీణ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి యాకయ్య మంగళవారం కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న యాకయ్య మొదట వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి వికటించటంతో ఆయన్ని హైదరాబాద్‌కు రెఫర్ చేశారు వైద్యులు. దీంతో యాకయ్యను హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కాగా, ప్రవీణ్ చిన్న తనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి ఆమె లేని లోటును తెలియకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు.
ప్రవీణ్ తల్లి చిన్నతనంలోనే చనిపోయిందని తెలుసుకున్న నటి ఇంద్రజ అతడ్ని సొంత కుమారుడిలాగా చూస్తుంటుంది. అప్పుడప్పుడు అవసరాలకు కొంత ఆర్థిక సాయం కూడా చేస్తుంటుంది. ఇద్దరి మధ్యా తల్లీకొడుకుల బంధంలాంటిది ఉందని ఓ ఇంటర్వ్యూలో ఇంద్రజ చెప్పుకొచ్చారు. ప్రవీణ తనను తల్లిలాగా భావిస్తాడని ఆమె అన్నారు. మరి, ప్రవీణ్ తండ్రి మరణం తాలూకా బాధనుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మీ సానుభూతిని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మేమేం తప్పు చేశాం? బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో ఆవేదన..