కమల్ హాసన్ గారల తనయగా.. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతీ హాసన్. సౌత్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంది శ్రుతీ హాసన్. అయితే ఈ అమ్మడి కెరీర్ ప్రారంభంలో వరుస ప్లాఫ్‌లు చవి చూసింది. దాంతో.. ఐరన్ లెగ్ అన్న ముద్ర పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో.. శ్రుతీ హాసన్ కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుస విజయాలు అమ్మడి ఖాతాలో పడ్డాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది ఈ భామ. ప్రేమలో పడటం.. నచ్చకపోతే విడిపోవడం.. ఆ వెంటనే మరో బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొట్టడం శ్రుతీ హాసన్‌కి చాలా కామన్. ఇక తాజాగా మరోసారి ఈ అమ్మడి బ్రేకప్ న్యూస్ వార్తల్లో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు..
ప్రస్తుతం హీరోయిన్ శృతి హాసన్ ముంబైలో ఉంటున్నారు. ఆమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకే ఇంటిలో ఉంటూ లివింగ్ రిలేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. రెండేళ్లకు పైగా శృతి-శాంతను మధ్య రిలేషన్ కొనసాగుతుంది. తొలిసారి శాంతను.. శృతి చెల్లి అక్షర హాసన్ బర్త్ డే వేడుకల్లో కనిపించాడు. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ సైతం హాజరయ్యాడు. ఈ సందర్భంగా తండ్రికి శాంతనుని పరిచయం చేసింది శ్రుతీ హాసన్. దాంతో శాంతను.. శ్రుతీ కొత్త బాయ్‌ఫ్రెండ్‌గా తెర మీదకు వచ్చాడు. ఆ తర్వాత నుంచి.. శాంతనుతో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలను, బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రుతీ హాసన్.
కాగా తాజాగా శృతి హాసన్, శాంతను హజారిక విడిపోయారన్న వార్త తెరపైకి వచ్చింది. వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ.. జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ వార్తలు తెర మీదకు రావడానికి ప్రధాన కారణం.. శృతి తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్. దీనిలో హీరోయిన్.. ‘‘నాతో నేను ఉంటేనే సంతోషం. నా విలువైన సమయాన్ని, ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను. జీవితంలో ఇక్కడ వరకు రావడం గొప్ప అదృష్టం. అందుకు కృతజ్ఞతలు.. ఎట్టకేలకు నాకు ఆ విషయం బోధపడింది’’ అనే కామెంట్ పోస్ట్ చేశారు.
ఈ భామ ఇలా సడెన్‌గా.. ఒంటరిగా ఉండటమే ఆనందమని చెప్పడానికి కారణం.. బ్రేకప్ అంటున్నారు ఈ పోస్ట్ చూసిన నెటిజనులు. మరి ఈ వార్తలపై శృతి ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా 2019లో శృతి లండన్ ప్రియుడు మైఖేల్ కోర్ల్సేకి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది కాలానికే.. శ్రుతి.. శాంతనుకి దగ్గరయ్యారు. ఇప్పుడు అతడిని కూడా వదిలేశారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. శృతి తెలుగులో మూడు భారీ చిత్రాలు చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణలకు జంటగా నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. అలానే డార్లింగ్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.