ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా దూసుకెళ్తోంది. హాలీవుడ్ ప్రేక్షకులను సైతం అబ్బుర పరుస్తున్నాయి ఇండియన్ ఫిల్మ్స్. దాంతో భారీ స్థాయిలో మల్టీస్టారర్ లు ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో చిత్రం రాబోతోంది అన్న వార్తలు చిత్ర పరిశ్రమలో హల్ చల్ సృష్టించాయి. తాజాగా బాక్సాఫీస్ బద్దలు అయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు సినిమాలతో అటు రాజకీయాలతో తీరికలేని సమయం గడుపుతున్నారు. ఓ వైపు షూటింగ్ లకు హాజరౌతూనే.. మరో వైపు రాజకీయంగా దూసుకెళ్తున్నారు పవర్ స్టార్. అయితే తాజాగా పవర్ స్టార్ కు సంబంధించిన బిగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేటంటే? పవన్ కళ్యాణ్-అజిత్ కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవల్లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట కోలీవుడ్, టాలీవుడ్ మేకర్స్. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు. ఇక ఏ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందో కూడా సమాచారం లేదు.
కానీ పవన్-అజిత్ కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవల్లో మల్టీస్టారర్ రాబోతోంది అని అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే నిజంగా వీరిద్దరు కలిసి నటించేందుకు అవకాశాలు ఉన్నాయి అనడానికి కొన్ని కారణాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అవేంటంటే? గతంలో అజిత్ నటించిన ‘వీరం’ సినిమాను పవన్ తెలుగులో ‘కాటమరాయుడు’ గా రీమేక్ చేసిన తెలిసిందే. పైగా ఇద్దరికి పెద్దగా ఫంక్షన్స్ కు వెళ్ళే అలవాట్లు కూడా లేవు. ఇక వీరిద్దరి ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉండటంతో.. వీరిద్దరిని కలిపి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు.
Ajith Kumar and Pawan Kalyan to Join Hands?😲
VIDEO: https://t.co/ICVMqoDSCY#pawankalyan #AjithKumar #Ajith #Ajithkumar𓃵 #tamicinema #cineulagam pic.twitter.com/PPhU7wDppR
— Cineulagam (@cineulagam) February 7, 2023
అయితే ప్రస్తుతం పవన్ ఇటు సినిమాలతో.. అటు పాలిటిక్స్ తో బిజీబిజీగా ఉన్నారు. పైగా ఇప్పటికే పవన్ చేతిలో హరిహరవీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలతో పాటుగా మరో రీమేక్ చిత్రాన్ని చేయనున్నారు పవన్. దాంతో మరో రెండు సంవత్సరాలు తీరికలేకుండా ఉన్నారు పవన్. ఈ నేపథ్యంలో పవన్-అజిత్ కాంబోలో సినిమా అని ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుండటం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏదిఏమైనప్పటికీ ఇటు పవర్ స్టార్ అటు అజిత్ కలిసి నటిస్తే.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ కావడం ఖాయమే అని అభిమానులు అంటున్నారు. మరి పవన్-అజిత్ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.