సినిమా రంగంలో లవ్‌లో పడటం.. డేటింగ్.. ఆనక నచ్చకపోతే.. బ్రేకప్ చెప్పుకోవడం చాలా సహజం. ఇక ఈ బ్రేకప్ బాధితుల్లో హీరోయిన్లే అధికంగా ఉంటారామే అనిపిస్తుంది. హీరోయిన్ త్రిష విషయంలో ఈ బ్రేకప్‌లు మరి కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. దశాబ్దంపైనే అయ్యింది. అయినా అమ్మడి గ్లామర్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పటికి చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది త్రిష. గత కొంత కాలంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ.. దూసుకుపోతుంది. ఇక వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన త్రిష.. టాలీవుడ్లో అగ్ర హీరోలందరితో నటించింది. అటు తమిళ్లో కూడా టాప్ హీరోలతో సినిమాలు చేసింది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది త్రిష. తాజాగా ఇన్ స్టా వేదికగా త్రిష చేసిన పోస్ట్ చూసి జనాలు షాకవతున్నారు. ఏంటి త్రిష మరోసారి లవ్‌లో ఫెయిలయ్యిందా అని చర్చించుకుంటున్నారు.
తాజాగా త్రిష తన ఇన్‌స్టాలో ‘‘విషపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు వాళ్లంతట వాళ్లే నీతో మాట్లాడటం మానేయడం చాలా సంతోషంగా ఉంది. వీటన్నింటిని చూస్తేంటే.. చెత్త దానంతటదే క్లీన్ అయినట్లుగా ఉంది’’ అని పోస్ట్ చేసింది త్రిష. ఇది చూసిన నెటిజనులు.. అదేంటి త్రిష మరోసారి లవ్‌లో ఫెయిలయ్యారా ఏంటి.. ఇంతకీ ఎవర్ని ఉద్దేశించి ఇలా పోస్ట్ చేశారు.. మరోసారి బ్రేకప్ ఆ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక గతంలో త్రిష ఓ కోలివుడ్ సినీ నిర్మాతతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరి లవ్‌ని ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు కూడా. కుటుంబ సభ్యుల ఆమోదంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. పెళ్లి పీటలు ఎక్కకుండానే వీరు బ్రేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత త్రిష మరో ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ బంధం కూడా మధ్యలోనే ముగిసిపోయింది. ఆ హీరో మరోకరిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో త్రిష చేసిన పోస్ట్ వైరల్ కాగా.. మరోసారి అదే పరిస్థితి రిపీటయ్యింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.