Allu Arjun: పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఫేమ్ ఖండాంతరాలు దాటింది. పుష్ప సినిమాలో బన్నీ మాస్ మ్యానరిజం, యాటిట్యూడ్, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక, అల్లు అర్జున్ ఫేమ్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద సినిమా ప్రాజెక్టులు ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం అల్లు అర్జున్‌తో మల్టీ స్టారర్ చేయటానికి ఆసక్తిచూపుతున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా బన్నీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు! బన్నీ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇందుకు సంబంధించి రంగం సిద్ధం అయినట్లు సమాచారం. అల్లు అర్జున్‌కు ఓ పెద్ద హాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సినిమా ఆఫర్ చేశారట. అమెరికాలో పరేడ్ కోసం వెళ్లిన ఆయనతో ఆఫర్‌కు సంబంధించిన చర్చలు కూడా జరిగాయంట. ఓ సూపర్ హీరో ప్రాంఛైజీలో బన్నీ నటించనున్నాడని టాక్. ఇక, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ తాజాగా, పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పుష్ప 2ను దర్శకుడు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొదటి భాగాన్ని మించి ఎలివేషన్స్‌తో రెండో భాగాన్ని తీయాలని భావిస్తున్నారంట. అందుకే స్టార్ క్యాస్ట్‌ను కూడా రంగంలోకి దించారంట. పుష్ప 2లో విజయ్ సేతుపతి నటించనున్నారంట. విజయ్ సేతుపతికి జంటగా ప్రియమణి నటించనున్నట్లు తెలుస్తోంది. మరి, అల్లు అర్జున్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : OTT Releases: రేపు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న 16 సినిమాలు!