95వ ఆస్కార్ వేడుకలలో తెలుగు పాట నాటు నాటు, ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' తమ డ్రీమ్ ని నిజం చేసుకున్నాయి. ఆస్కార్ గెలిచి.. ఇండియన్స్ ప్రౌడ్ గా ఫీలయ్యే మూమెంట్ ని తీసుకొచ్చాయి. ఆస్కార్స్ కి ఇండియా నుండి మొత్తం మూడు కేటగిరిస్ లో సినిమాలు నామినేట్ అయ్యాయి. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో 'ఆల్ దట్ బ్రీత్స్'కి నిరాశే మిగిలింది.
95వ ఆస్కార్ వేడుకలలో తెలుగు పాట నాటు నాటు, ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ తమ డ్రీమ్ ని నిజం చేసుకున్నాయి. ఆస్కార్ గెలిచి.. ఇండియన్స్ ప్రౌడ్ గా ఫీలయ్యే మూమెంట్ ని తీసుకొచ్చాయి. ఈసారి ఆస్కార్స్ కి ఇండియా నుండి మొత్తం మూడు కేటగిరిస్ లో సినిమాలు నామినేట్ అయ్యాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింగా ఆల్ దట్ బ్రీత్స్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా ది ఎలిఫెంట్ విస్ఫరర్స్.. వీటిలో నాటు నాటు, ది ఎలిఫెంట్ విస్ఫరర్స్ లను ఆస్కార్స్ వరించగా.. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో ఆల్ దట్ బ్రీత్స్ కి నిరాశే మిగిలింది.
లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా.. ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు ఎంతోమంది హాలీవుడ్ ప్రముఖులు నాటు నాటుని నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఆయితే.. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ గా నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్`కి ఆస్కార్ రాలేదు. ఆ కేటగిరిలో అమెరికాకు చెందిన `నావల్నీ` డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కి అవార్డు వరించింది. ఇక `నావల్నీ’ ఫిల్మ్ ని డానియల్ రోహెర్ తెరకెక్కించారు. దీని కథ.. రష్యా అపోజిషన్ లీడర్ అలెక్సీ నావల్నీ చుట్టూ తిరుగుతుంది.
ఇదిలా ఉండగా.. ఆస్కార్ కి నామినేట్ అయి.. అవార్డు దక్కించుకోలేకపోయిన ఇండియన్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ `ఆల్ దట్ బ్రీత్స్`ని షానక్ సేన్ రూపొందించారు. ఇది ఇద్దరు అన్నదమ్ముల గురించి జరిగే కథ. మరి డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింగా ఆల్ దట్ బ్రీత్స్ కూడా అవార్డు గెలిస్తే బాగుండేదని అనిపించినా.. నాటు నాటు, ది ఎలిఫెంట్ విస్ఫరర్స్ గెలిచాయి అని సంతోషం ఇండియన్స్ అందరిలోనూ కనిపిస్తోంది. ఇక ఆస్కార్ లో తెలుగు సాంగ్ నాటు నాటు చూపించిన ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచదేశాల ఆడియెన్స్ నే కాకుండా ఆస్కార్ స్టేజ్ ని కూడా ఊపేసింది. మరి ఆస్కార్ గెలిచేందుకు ప్రతి ఏటా ఇండియన్ సినిమాలు ప్రయత్నాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Congratulations to ‘Navalny,’ this year’s Best Documentary Feature Film! #Oscars95 pic.twitter.com/xOp8ujCa4k
— The Academy (@TheAcademy) March 13, 2023