సాధారణంగా మన దేశంలో సినిమా వాళ్లకున్న అభిమానులు ఇక ఎవరికి ఉండరేమో. ఇక హీరో హీరోయిన్లకు గుడి కట్టన ఘనత కూడా ఇండియన్ అభిమానులకే చెందుతుంది. ప్రస్తుతం మన సౌత్ స్టార్స్ కూడా పాన్ ఇండియా రేంజ్లో చెలరేగిపోతున్నారు. ఇక బాహుబలి వంటి సినిమాల వల్ల అయితే కొందరు హీరోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ అభిమాని మాత్రం కాస్త భిన్నం. వారి కుటుంబం అంతా ఏకంగా తమ అభిమాన హీరోని దైవంగా భావించి విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముందు వరసలో ఉంటారు. ఎన్నో ఏళ్లుగా సినిమాల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు బిగ్ బీ. అలాంటి అభిమానుల్లో ఒకరు అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో నివసిస్తున్న గోపిసేథ్. వీరి కుటుంబంలో వృద్ధులు మొదలు చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంటే అమితమైన ఇష్టం. కుటుంబంలోని అందరూ బిగ్ బీకి అభిమానులు.
ఈ క్రమంలో తమ అభిమాన స్టార్‌పై ప్రేమను చాటుకునేందకు ఏకంగా బిగ్ బీని తమ ఆరాధ్య దైవంగా భావించి ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. అమితాబ్ విగ్రహాన్ని ఓ పెద్ద గాజు బాక్స్‌లో ఏర్పాటు చేశారు. ఇక బిగ్ బీ విగ్రహావిష్కరణ వేడుక సందర్భంగా సుమారు 600 మంది అభిమానులు హాజరయ్యారు. ఇండియన్ సూపర్‌స్టార్ ఫ్యాన్స్ అసోసియేషనస్ ఫ్యాన్స్ క్లబ్ అధ్వర్యంలో టపాకులు కాలుస్తూ.. డ్యాన్స్‌లు చేస్తూ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఈ విగ్రహాన్ని కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అమితాబ్ లుక్ ఎలా ఉంటుందో అలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీనికోసం ఏకంగా 75 వేల డాలర్లు అంటే 60 లక్షల రూపాయలు ఖర్చుతో రాజస్తాన్‌లో తయారు చేయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఈ సందర్భంగా గోపిసేథ్ మాట్లాడుతూ.. ‘‘మొదటి సారి 1991లో న్యూజెర్సీలో జరిగిన నవరాత్రి ఉత్సవాలకు అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు. అప్పుడు తొలిసారి ఆయనను కలిశాను. అప్పటి నుంచి నేను ఆయనకు పెద్ద అభిమానిగా మారాను. రీల్ మీదనే కాక రియల్ లైఫ్‌లోనూ కూడా ఆయన హీరోనే. బిగ్ బీ మాట తీరు, మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు అద్భుతం. ఆయన నాలో ఎంతో స్ఫూర్తి పొందాను. నాకు, నా భార్యకు ఆయనే దైవం. అందుకే నా ఇంటి ముందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాను’’ అని తెలిపారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.