తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే షోల్లో జబర్దస్త్ ఒకటి. ఈ షో ద్వారా చాలా మంది తమ ప్రతిభను చూపించారు. ఇందులో కొందరు మంచి గుర్తింపు పొంది.. సినిమాలో సైతం నటిస్తున్నారు. అలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. ఆది బుల్లితెర షోల్లో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన పంచ్ లతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంటాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ-14 వంటి షోల్లో కామెడీ పంచ్ లు పేల్చుతూ ఆది సందడి చేస్తుంటాడు. షోల్లోని జడ్డీలతో కలిసి ఆది కామెడీ పండిస్తాడు. తాజాగా ఢీ-14 ప్రోమో రిలీజ్ చేశారు. శ్రద్దా దాస్, హైపర్ ఆది మధ్య రొమాంటిక్ ట్రాక్ నడిచింది. శ్రద్దా.. ఆదికి ముద్దు ఆఫర్ చేసింది. ఆగష్టు 24న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఢీ షోలో జడ్జీగా ఉండే హీరోయిన్స్ పై ఆది పంచ్ లు కురిపిస్తుంటాడు. వారిపై తనకున్న ప్రేమను చూపిస్తుంటాడు. గతంలో ప్రియమణితో సైతం అలానే ప్రేమ పేరుతో అనేక పంచ్ లు వేసి సందడి చేశాడు. తాజాగా ఢీ-14 షోల్లో శ్రద్దా దాస్, హైపర్ ఆది మధ్య లవ్ ట్రాక్ ను మేకర్స్ క్రియేట్ చేశారు. శ్రద్దా అందాలకు ఫిదా అవుతున్న హైపర్ ఆది ఆమెని అదే పనిగా ఫ్లటరింగ్ చేస్తున్నాడు. ఈక్రమంలో ఆది మాటలకు శ్రద్దా కూడా ఫిదా అయిపోతోంది. తాజాగా ప్రోమోలో మరోసారి వారిద్దరి రోమాన్స్ బయటపడింది. ప్రోమోలో అందరి ముందు శ్రద్దా దాస్ హైపర్ ఆదికి ముద్దు ఆఫర్ ఇచ్చింది. మంచు గడ్డపై కాసేపు నిలబడితే ముద్దు ఇస్తానని శ్రద్దా దాస్ చెబుతుంది. దీనితో ఆది గాల్లో తేలిపోతాడు.
శ్రద్దా దాస్ ముద్దు కోసం మంచు గడ్డపై నిల్చునే సాహసం చేశాడు. మంచుపై నిల్చోని శ్రద్దా దాస్ పై పాటలు పాడాడు. హైపర్ ఆది పడే బాధలు చాలా ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. మరి హైపర్ ఆది మంచు గడ్డపై శ్రద్దా దాస్ చెప్పిన సమయం మొత్తం నిల్చున్నాడా .. ఆమె ముద్దు అందుకున్నాడా అనేది పూర్తి ఎపిసోడ్ లో తేలనుంది. అక్కడ ఉన్న వారంతా తమ మొదటి ప్రేమ గురించి చెబుతుంటారు. హైపర్ ఆది కూడా తన ఫస్ట్ లవ్ గురించి బయటపెట్టాడు.
ఆది మాట్లాడుతూ…” నేను 8వ తరగతి వరకు మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ లో చదివాను. 9వ తరగతి నుంచి ప్రైవేటు స్కూల్ కి మారాను. ఈ క్రమంలో అక్కడే ఓ అమ్మాయిని చూశాను. ఆమె నా ఫస్ట్ లవ్” అని ఆది తెలిపాడు. మొత్తానికి తాజా ఢీ-14 ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రోమోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.