టాలీవుడ్ లో పక్కా ప్లానింగ్ తో కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అడవి శేష్. రిస్క్ లేకుండా తన సినిమాలకు తానే కథాకథనాలు రాసుకుంటున్న శేష్.. అప్పుడప్పుడు బయట కథలలో కూడా నటిస్తుంటాడు. అయితే.. ఏ సినిమా చేసినా అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం పక్కాగా ఉండేలా చూసుకుంటాడు శేష్. ఈ క్రమంలో ఇప్పుడు ‘హిట్ 2’ మూవీ చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్. ఆ సినిమాతో శైలేష్ కొలను దర్శకుడిగా డెబ్యూ చేశాడు. మొదటి ప్రయత్నంలోనే సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.
మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. రెండో భాగంలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శేష్ కి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. అయితే.. డిసెంబర్ 2న రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ రీసెంట్ గా టీజర్ తో ప్రారంభించారు మేకర్స్. ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ క్రైమ్, రక్తపాతంతో కూడిన హిట్ 2 టీజర్ పై తాజాగా యూట్యూబ్ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. టాప్ లో ఉన్న హిట్ 2 టీజర్ ని ట్రెండింగ్ లిస్ట్ నుండి తొలగించి.. ఏజ్ లిమిట్ విధించింది. అంటే.. ఇప్పుడు హిట్ 2 టీజర్ చూడాలంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండినవారై ఉండాలని పేర్కొంది.
హిట్ 2 టీజర్ పై యూట్యూబ్ ఆంక్షలు విధించడంపై హీరో అడవి శేష్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. “యూట్యూబ్ విధించిన ఆంక్షలను మేము గౌరవిస్తున్నాం. ఇకపై 18 ఏళ్ళు నిండినవారు ఈ టీజర్ ని చూడవచ్చు. అయితే.. ఇదంతా మేం ముందే ఊహించాం. అయినా పర్లేదు. ఇప్పుడు హిట్ 2 నుండి ‘ఉరికే ఉరికే’ సాంగ్ వచ్చింది.. ఎంజాయ్ చేయండి” అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. హిట్ 2లో హారర్ సీన్స్ చాలానే ఉన్నాయని.. టీజర్ లాంచ్ లోనే హింట్ ఇచ్చారు మేకర్స్. సో.. చూడాలి మరి వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న అడవి శేష్ ఇప్పుడు మరో హిట్ అందుకుంటాడేమో!
#HIT2 Teaser got REMOVED from YouTube Trending 😑 But no worries #UrikeUrike Song out tomorrow ❤️
😡@KolanuSailesh pic.twitter.com/vCYRu3HIHu
— Adivi Sesh (@AdiviSesh) November 9, 2022