శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో చాలా మంది తారలు పాల్గొన్నారు. హీనా ఖాన్ కూడా ఈ సమ్మిట్ లో తళుక్కుమని మెరిసింది. కానీ.. ఓ చిన్న తప్పిదంతో ఇప్పుడు భారీగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఏ పని చేసినా.. కాస్త వెరైటీగానే ఉంటుంది. ఈ క్రమంలో వారు కొన్ని విమర్శలను సైతం ఎదుర్కొంటూ ఉంటారు. బీ టౌన్ ఇలాంటి వివాదాస్పద ఒయ్యారీల లిస్ట్ ఎక్కువే ఉంది. అయితే.. తాజాగా ఈ లిస్ట్ లోకి నటి హీనా ఖాన్ కూడా వచ్చి చేరింది. బాలీవుడ్ పై కాస్త గ్రిప్ ఉన్న ఎవరికైనా హీనా ఖాన్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర నటిగా కెరీర్ స్టార్ చేసి., తరువాత బిగ్ బాస్ షోలోకి ఎంటరై మంచి స్టార్ డమ్ సొంతం చేసుకుంది హీనా ఖాన్. ఇక ఈ మధ్య అమ్మడు టైమ్ కాస్త బాగుండటంతో ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ.., ఇంతా సాధించి హీనా.. ఓ చిన్న తప్పిదంతో ఇప్పుడు భారీగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో చాలా మంది తారలు పాల్గొన్నారు. హీనా ఖాన్ కూడా ఈ సమ్మిట్ లో తళుక్కుమని మెరిసింది. బుల్లితెర నుండి కెరీర్ స్టార్ట్ చేసి.. హీనా ఇలా జీ20 సమ్మిట్ లో పాల్గొనే స్థాయికి ఎదగడంతో అంతా ఆమెపై ప్రశంసలు కురిపించారు కూడా. అయితే.. సమ్మిట్ మీటింగ్ తరువాత ఈ అమ్మడు నేరుగా ముంబయి విమానాశ్రయం చేరుకుంది. ఈమెని రిసీవ్ చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ అప్పటికే ఎయిర్ పోర్ట్ బయట ఎదురుచూస్తూ గడిపాడు. కాస్త గ్యాప్ తరువాత ఈ అమర ప్రేమికులు ఎదురు పడటంతో ఇద్దరు తన్మయత్వం చెంది ఏకంగా ముద్దులతో రెచ్చిపోయారు. నటిగా మంచి స్థాయిలో లో ఉండి కూడా హీనా ఇలా పబ్లిక్ గా లిప్ లాక్స్ తో రెచ్చిపోవడం అందరిని షాక్ కి గురి చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వడంతో అందరూ హీనా, ఆమె ప్రియుడు రాకీ జైస్వాల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
కొంత సమయం తరువాత ఎదురుపడ్డ ప్రేమికులు.. అంత ఫాస్ట్ గా ముద్దులు పెట్టుకోవాలా? ఇంటికి వెళ్లే వరకు ఆగలేరా? ఇలా చేసినందుకు మీరు సిగ్గుపడాలి అంటూ ఓ నెటిజన్ ఘాటుగా విమర్శ చేశారు. అయితే.. హీనా ఖాన్ గాని, ఆమె బాయ్ ఫ్రెండ్ రాకీ గాని ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు. నెటిజన్స్ మాత్రం వారు తప్పకుండా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉండగా.. ఆ మధ్య వీరిపై బ్రేకప్ రూమర్స్ బలంగా వినిపించాయి. కానీ.., హీనా ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ.. ప్రియుడితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది. కానీ.., బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోస్‌లో రన్నరప్‌గా నిలిచిన హీనాకి.. తెలివి ఉండి కూడా పబ్లిక్ ప్లేస్ ఇలా ముద్దులతో రెచ్చిపోవడం ఏమిటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఓ నటి ఇలా పబ్లిక్ గా ముద్దులతో రెచ్చిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#HinaKhan spotted at Mumbai Airport Rocky came to pick her 🧿💕❤️ @eyehinakhan @JJROCKXX #HiRo #HinaKhan #rRockyJaiswal #NachBaliye #NachBaliye10 #CoupleGoals #Couple #Love #Mumbai #Airport #MumbaiAirport #AirportFashion #Bollywood #BollywoodActress pic.twitter.com/hgECADd84t
— hina_khanfc (@Mohamme37896951) May 24, 2023