ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమాల సంఖ్య పెరిగిందని చెప్పాలి. ఇటు బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేస్తూనే.. మరోవైపు ప్రపంచ దేశాలలో ఇండియన్ సినిమాలు ఉనికిని చాటుకున్నాయి. 2022.. తెలుగు సినీ ప్రేక్షకులకు మరో మెమోరీ కాబోతుంది. హిట్లు.. సూపర్ హిట్లు.. ఇండస్ట్రీ హిట్లు.. అంతకుమించి ప్లాపులు.. అన్నింటినీ మించి జనాలకు పేర్లు కూడా తెలియని సినిమాలెన్నో. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలు కమర్షియల్ గా ఎంతో సక్సెస్ అయ్యాయి. పెట్టిన బడ్జెట్ తో పాటు లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల సంఖ్య పెద్దగానే నమోదు అయ్యింది.
ఈ ఏడాది ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లు క్రాస్ చేయగా.. పొన్నియన్ సెల్వన్, విక్రమ్, బ్రహ్మాస్త్ర, కాంతార లాంటి సినిమాలు రూ. 400 కోట్లు క్రాస్ చేసి దుమ్ముదులిపాయి. వీటితో పాటు ఈ సంవత్సరం రూ. 100 కోట్లతో టాక్, కలెక్షన్స్ పరంగా ఇండస్ట్రీలలో కొత్త ఆశలు రేకెత్తించిన సినిమాలు చాలా ఉన్నాయి. టాక్ కి భిన్నంగా వసూళ్లు రాబట్టినవి కూడా ఉన్నాయి. కట్ చేస్తే.. కలెక్షన్స్ తో నిర్మాతలకు ప్రాఫిట్స్ అందించిన సినిమాలలో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక భాషకు పరిమితం కాకుండా ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ ఈ విధంగా ఉంది.
పైవన్నీ టాప్ మినిమమ్ రూ. 200 కోట్లతో టాప్ గ్రాసర్స్ కాగా.. ఇదే వరుసలో రూ. 100 కోట్లతో రాధేశ్యామ్, సర్కారు వారి పాట, జేమ్స్, లాల్ సింగన చడ్డా, కార్తికేయ 2, భీమ్లా నాయక్, విక్రాంత్ రోణ, 777 చార్లీ, జుగ్ జుగ్ జియో, గాడ్ ఫాదర్, డాన్, తిరు సినిమాలు నిలిచాయి. మొత్తానికి 2022లో అన్ని భాషల నుండి హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు నమోదయ్యాయి. అయితే.. ఈ జాబితాలోకి ఇంకా మలయాళం సినిమాలు చేరకపోవడం గమనార్హం. చూడాలి మరి.. ఈసారి 2023లో స్టార్ హీరోల సినిమాల మధ్య పోరు మామూలుగా ఉండేలా లేదు. ఇప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి రచ్చ లేపుతున్నారు. మరి 2022లో విడుదలైన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమాలేంటో కామెంట్స్ లో తెలపండి.