ఆమె అచ్చతెలుగమ్మాయి. కానీ చూస్తే మాత్రం ముంబయి నుంచి దిగొచ్చిన బ్యూటీలా అనిపిస్తుంది. ఇన్ స్టాలో ఆమె గ్లామరస్ ఫొటో పోస్ట్ చేస్తే చాలు.. నెటిజన్స్ రెచ్చిపోతారు. కొన్ని సెకన్ల పాటు మైమరిచిపోతారు. ఎందుకంటే అంత హాట్ నెస్ ఉంటుంది కాబట్టి. ఇక స్టార్ హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ పాపులారిటీ సంపాదించింది. మరోవైపు టీమిండియా క్రికెటర్ తోనూ ఈ భామ.. సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారే హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో పుట్టి పెరిగిన ఈమె.. హైదరాబాద్ లోని NIFTలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివింది. ఇక నటనపై ఆసక్తి ఉండటంతో షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. అలా ఈమెకు ‘కలవరమాయే’ సినిమాలో అవకాశమొచ్చింది. కానీ గుర్తింపు ఏం రాలేదు. ఇక విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘ట్యాక్సీవాలా’ సినిమాలో కథానాయికగా చేసిన ప్రియాంక.. ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేస్తూ మెప్పించింది.
‘ట్యాక్సీవాలా’ తర్వాత తెలుగులో తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణ మండపం, గమనం లాంటి సినిమాలు చేసింది. పలు వెబ్ సిరీసుల్లో కూడా యాక్ట్ చేసింది. ఇక ప్రియాంక ఇన్ స్టాలో ఫొటోల విషయానికొస్తే.. కిర్రాక్ గా ఉండే హాట్ హాట్ ఫొజులతో ఆమె మాయ చేస్తోంది. ప్రత్యేకించి ఈ ఫొటోలకు చాలామంది ఫ్యాన్స్ ఉండటం విశేషం. ఇక ఐపీఎల్ లో కోల్ కతా తరఫున అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా ప్రియాంక ఇన్ స్టాలో అప్పుడప్పుడు కామెంట్స్ పెట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని మాట్లాడుకున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.