టాలీవుడ్ లోకి ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. తమ లక్ పరీక్షించుకుంటారు. వారిలో హిట్స్ కొట్టి వాళ్లే.. ఫైనల్ గా నిలబడతారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తారు. అలా కన్నడ భామ నభా నటేష్ కూడా పలు సినిమాలు చేసింది. కానీ గత ఏడాదిన్నర కాలంలో కొత్త సినిమా ఏం చేయలేదు. ఎక్కడ ఉందనేది కూడా ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అదికాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యాక్సిడెంట్ ఎప్పుడు ఎలా జరిగింది. కనీసం న్యూస్ కూడా బయటకు రాలేదు అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.
ఇక విషయానికొస్తే.. నభా నటేష్ అనగానే కొందరికి గుర్తురాకపోవచ్చేమో గానీ ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ అనగానే గుర్తుపట్టేస్తారు. అందులో నిధి అగర్వాల్ తో పాటు ఈమె కూడా హీరోయిన్ గా చేసింది. ఆ ఒక్క మూవీ తప్పించి సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా సొంతం చేసుకోలేకపోయింది. సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నభా.. తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాలు చేసింది. ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ తప్పించి మరో మూవీ హిట్ కాలేదు. దీంతో ఈమెపై ఐరన్ లెగ్ అనే స్టాంప్ పడిపోయింది. ఇక తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ అయితే అభిమానులకు షాకిచ్చింది.
‘నేను గతేడాది సినిమాలు చేయలేదు. నాలాగే మీకు కూడా మిస్సయిన ఫీలింగ్ ఉంటుందని నాకు తెలుసు. 2022లో నాకు యాక్సిడెంట్ జరిగింది నా ఎడమ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చాలా సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఇది నన్ను మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు నేను కోలుకున్నాను. ఎంతో ఇష్టపడే సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను. మీ ప్రేమ, అభిమానం వల్లే నేను రికవరీ అయ్యాను. నా ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2023.. నేను రెడీ’ అని తన ఇన్ స్టా, ట్విట్టర్ లో రాసుకొచ్చింది. అయితే నభా.. గతేడాది జూన్-అక్టోబర్ మధ్య కాలంలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. బహుశా ఆ టైంలోనే యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. ఏదైతేనేం.. నభా కోలుకోవడంతో ఫ్యాన్స్ అందరూ ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఈసారి జర్నీ చేసేటప్పుడు కేర్ ఫుల్ గా ఉండాలని జాగ్రత్తలు చెబుతున్నారు.