సినిమా ఫీల్డ్ అనగానే రంగుల ప్రపంచమే గుర్తొస్తుంది. హీరోయిన్ల అందాలు, వాళ్ల గ్లామర్ ఉట్టిపడేలా డ్రస్సులు, వాళ్ల సోకుల సొగసులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే హీరోయిన్లలో కొందరు నిండుగా ఉంటే.. మరికొందరు మాత్రం సన్నగా కనిపిస్తుంటారు. కెరీర్ ప్రారంభంలో ముద్దుగా ఉండే భామలు కూడా ఛాన్సుల కోసమే, లుక్ లో మార్పు కోసమే తెలియదు గానీ మొత్తం రూపమే మారిపోయిందా అన్నంతగా మారిపోతుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ హీరోయిన్ చాలా సన్నగా మారిపోయి పోజులిచ్చింది. ఆ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఫ్యాన్స్ మధ్య చర్చకు దారితీసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హిందీ డబ్బింగ్ సీరియల్స్, సినిమాలు చూసేవాళ్లకు హీరోయిన్ మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీ నటిగా మొదలైన ఈమె కెరీర్.. ప్రస్తుతం స్టార్ హీరోలతో నటించేవరకు సాగింది. ఇక ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో విలన్ తరహా పాత్రలో కనిపించి వావ్ అనిపించింది. గతేడాది తన ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ఈ భామ.. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తూనే మరోవైపు యాక్టింగ్ పైనా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా అలా పెట్టిన ఫొటోలు తెగ వైరలయ్యాయి.
ఈ ఫొటోల్లో భాగంగా నాభి అందాలు చూపించిన మౌనీరాయ్.. మెడలో నెక్లెస్ తో రెచ్చిగొట్టే పోజుల్లో కనువిందు చేసింది. ఇంతకుముందు కాస్త నార్మల్ గా ఉన్న ఈ భామ.. పెళ్లి తర్వాత మాత్రం రోజురోజుకీ సన్నగా మారుతూ వస్తోంది. మరికొన్ని రోజులైతే తీగలా అయిపోతుందేమోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరికొందరు మాత్రం మౌనీరాయ్ అందాలని ఆస్వాదిస్తూ ఆ ఫొటోలు చూస్తున్నారు. తెలుగులో కీర్తి సురేష్, రాశీఖన్నా లాంటి హీరోయిన్లు అప్పట్లో సన్నగా మారి షాకిచ్చారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు అనిపించేలా ఉన్నారు. ఏదేమైనా సరే స్టార్ హీరోయిన్లు ఇలా సన్నజాజిల్లా మారడం ఫ్యాన్స్ కి షాకిస్తోంది. మరి మౌనీరాయ్ ఫొటోలు చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.