హీరో విజయ్ ఆంటోని. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘బిచ్చగాడు’ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్న మనోడు.. ఆ తర్వాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే అవన్నీ దాదాపు తమిళంలోనే రిలీజ్ అవుతున్నాయి తప్పితే తెలుగులో డబ్ కావడం లేదు. ఇక చాలా రోజుల తర్వాత ‘బిచ్చగాడు 2’తో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైపోయాడు. అందుకు తగ్గట్లే షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో భారీ ప్రమాదం జరగడం అందరినీ షాక్ కి గురిచేసింది.
ఇక విషయానికొస్తే.. హీరో విజయ్ ఆంటోని, గత నెలలో మలేసియాలో షూటింగ్ సందర్భంగా ప్రమాదం జరిగింది. బోట్ లో ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా ఈ యాక్సిడెంట్ అయింది. హీరో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని అక్కడే హాస్పిటల్ లో చేర్చారు. విజయ్ ముఖం, దవడకు గట్టిగా దెబ్బలు తగిలాయని.. కోమాలోకి కూడా వెళ్లిపోయాడని అన్నారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే జనవరి 24న విజయ్ ఆంటోనినే స్వయంగా ట్వీట్ చేశాడు. తనకు సర్జరీ జరిగిపోయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని రాసుకొచ్చాడు.
సర్జరీ జరిగి వారమైనా అయిందో లేదో ఇప్పుడు ఏకంగా షూటింగ్ కే వచ్చేశానని షాకింగ్ విషయాన్ని విజయ్ ఆంటోని ట్వీట్ చేశాడు. దీన్ని చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. దానికి తోడు సినిమా సెట్ లో అడుగుపెట్టేశారని, చెప్పినట్లే ఏప్రిల్ లోనే మూవీని థియేటర్లలోకి తీసుకొస్తామని తన ట్వీట్ లో క్లారిటీ ఇచ్చేశాడు. 90 శాతం కోలుకున్నానని, విరిగిన దవడ-ముక్కు ఎముకలు కూడా కలిసిపోయాయని చెప్పుకొచ్చాడు. విజయ్ ఆంటోని చాలా ఫాస్ట్ గా కోలుకోవడం చూసి ఫ్యాన్స్ కూడా తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి ఈ యాక్సిడెంట్, త్వరగా రికవరీ కావడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
அன்பு இதயங்களே
நான் 90% குணம் அடைந்து விட்டேன்.
உடைந்த என் தாடை, மூக்கு எலும்புகள் ஒன்று சேர்ந்துவிட்டன.
என்னமோ தெரியவில்லை, நான் இப்போது முன்பைவிட அதிக சந்தோஷத்தை உங்களால் உணருகிறேன்😊
வரும் ஏப்ரல் வெளியாகும் பிச்சைக்காரன் 2 பட வேலைகளை இன்று முதல் தொடங்குகிறேன்🙏
அன்புக்கு நன்றி— vijayantony (@vijayantony) February 2, 2023