తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కాయి. ఈ నేపథ్యంలో తనీష్ హీరోగా దర్శకుడు జాని తెరకెక్కించిన చిత్రం ‘మరో ప్రస్థానం’. ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.
బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన తనీష్ తర్వాత హీరోగా మారాడు. బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ లో తన సత్తా ఏంటో చూపించాడు. తాజాగా తనీష్ జోడీగా ముస్కాన్ సేథీ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో భానుశ్రీ మెహ్రా కనిపించనుంది. రాజా రవీంద్ర, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆద్యంతం యాక్షన్ ఎమోషన్ హైలైట్ గా నిలవగా తనీష్ సీరియస్ ఇంటెన్స్ రోల్ ఆకట్టుకుంది. ‘అనాథనైన నాకు జీవితం యుద్ధంలానే అనిపించేది. ప్రపంచం యుద్దభూమిలా కనిపించేది’ అంటూ తనీశ్ తన పాత్రని వివరించిన తీరు బాగుంది.
ఒక డెన్‌లో కంటిన్యూగా జరిగిన కథ ఇది. సన్నివేశాల్ని కెమెరా రికార్డ్ చేయడం కనిపిస్తోంది. రియల్ టైమ్ రీల్ టైమ్ ఒకటే కలిగి ఉన్న సినిమా ఇది. సినిమాలో కథ ఎంత టైమ్‌లో జరిగితే సరిగ్గా అదే టైమ్‌కు షో పూర్తవుతుంది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ జానీ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా గురించి హీరో తనిష్ మాట్లాడుతూ… ఈ చిత్రం టీమ్ అంతా ఎంతో కష్టపడి తీశామని.. నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమవుతుంది. దీంట్లో వాస్తవ ఘటనలు, సమకాలీన సమస్యల్ని చూపిస్తున్నాం అన్నారు. ఈ సినిమా ఈనెల 24న రానుంది.