తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సీనియర్ హీరో శ్రీకాంత్. దాదాపు ఇప్పటికీ 125పైగా సినిమాల్లో నటించిన శ్రీకాంత్ తన నటన శైలీతో అందరినీ మెప్పించి ఆకట్టుకున్నాడు. ఇక శ్రీకాంత్ హీరోగానే కాకుండా ఈ మధ్యకాలంలో విలన్ పాత్రలో కూడా నటిస్తూ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి అదరగొడుతున్నాడు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ అప్పట్లో సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే నటి అయిన ఊహ పరిచయం అయింది. ఇక వీరిద్దరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఒకరికొకరు నచ్చుకోవడంతో అప్పట్లో వీళ్లిద్దరూ పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్ళి చేసుకున్నారు.
అలా కొంత కాలానికి ఈ దంపతులకు రోషన్, మేధ, రోహన్ అనే ముగ్గురు పిలల్లు జన్మించారు. ఇక పెద్ద కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నిర్మలా కాన్వెంట్ సినిమాతో పాటు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చని పెళ్లి సందD మూవీలో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి హీరో శ్రీకాంత్, ఊహ మధ్య విడాకులంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అభిమానులు సైతం ఈ వార్తలో నిజమెంత? అబద్దం ఎంత? అనేది తెలియక తికమకలో పడిపోతున్నారు.
అయితే తన భార్యతో విడాకులపై హీరో శ్రీకాంత్ తాజాగా స్పందిస్తూ సుమన్ టీవీకి క్లారిటీ ఇచ్చారు. నేను, నా భార్య ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నామని, మీమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని కొందరు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఈ వార్తలో అస్సలు నిజం లేదని, అవన్నీ పుకార్లేనంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే హీరో శ్రీకాంత్ దంపతులు విడాకులు అంటూ వస్తున్న వార్తలపై శ్రీకాంత్ క్లారిటీ ఇవ్వడంతో ఈ ఫేక్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.