తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన చిత్రం ‘ప్రేమదేశం’. ఈ చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ ‘ముస్తాఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా’ అనే సాంగ్ ఇప్పటికీ మారు మోగుతూనే ఉంది. కదీర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమదేశం’ చిత్రం తమిళ్, హిందీ భాషల్లో కూడా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు ఎలాంటి త్యాగం చేశారన్నదే ఈ చిత్రం. ఈ మూవీలో అబ్బాస్, వినిత్, టబు ముఖ్య భూకిక పోషించారు. ఈ చిత్రం తర్వాత అబ్బాస్ బాగా ఫేమస్ అయ్యాడు.
ప్రేమదేశం హిట్ తర్వాత అబ్బాస్ కి వరుసగా ఆఫర్లు వచ్చాయి. కాకపోతే సరైన హిట్ మాత్రం దక్కలేదు. అబ్బాస్ తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ భాషల్లో నటించాడు. 2015 తర్వాత తన సినీ కెరీర్ కి బ్రేక్ తీసుకొని భార్యాబిడ్డలతో ఫారిన్ వెళ్లి సెటిల్ అయ్యాడు. అబ్బాస్ చివరిగా బ్యాంక్ చిత్రంలో కనిపించాడు. తాను సర్జరీ చేయించుకున్నానని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని హీరో అబ్బాస్ స్వయంగా సోషల్ మీడియా వేధికగా ప్రకటించాడు. అబ్బాస్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినీ ఇండస్ట్రీలో హీరోగా చెలామని అయిన అబ్బాస్ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో సతమతం అయ్యాడు. ఇక ఇండస్ట్రీలో రాణించడం కష్టంగా బావించిన అబ్బాస్ తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చి.. తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్లి అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. తాజాగా అబ్బాస్ తన కుడికాలికి శస్త్ర చికిత్స జరిగిందని.. ప్రస్తుతం తాను ఆస్పత్రిలో రెస్ట్ తీసుకుంటున్నానని స్వయంగా ప్రకటించాడు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో తన మనసు ఏమాత్రం ప్రశాంతంగా లేదని.. శస్త్ర చికిత్స తర్వాత కొంత రిలీఫ్ అయ్యిందని.. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ మనసారా ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేధికగా తెలిపాడు.