టాలీవుడ్ యంగ్ హీరో, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి ధరమ్.. ఆ తరువాత తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించారు. అయితే ఆయనకు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తనను కాపాడిన వ్యక్తికి చేసిన సాయం గురించి.. తాజాగా వెల్లడించారు.
టాలీవుడ్ యంగ్ హీరో, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి ధరమ్.. ఆ తరువాత తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించారు. అలానే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆయనకు రెండేళ్ల క్రితం ఓ పెను ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 10న దుర్గంచెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ రోజు ఓ వ్యక్తి.. సాయి ధరమ్ తేజ్ ను కాపాడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. ఆ వ్యక్తి గురించి పంచుకున్నారు. ఆయనకు తాను చేసే సాయం ఇదే అంటూ ఎమోషన్లగా మాట్లాడారు.
రెండేళ్ల క్రితం దుర్గం చెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రమైన గాయాలు కావడంతో సాయి ధరమ్ చాలా రోజులు ఆస్పత్రిలో అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అలా చాలా రోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే హెల్మెట్ అతడి ప్రాణాలను నిలిపింది. అయితే ప్రమాదం జరిగిన రోజు సాయి ధరమ్ తేజ్‌ను గుర్తించి.. అతడిని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లేలా సయ్యద్ అబ్ధుల్ అనే వ్యక్తి కృషి చేశాడు.
ఆ రోజు అతడు చేసిన ఆ సాయం కారణంగానే సాయి ధరత్ తేజ్ నేడు అందరి ముందు తిరుగుతున్నాడు. ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత సాయి ధరమ్ తేజ్ అతడిని కలిశాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సాయి ధరమ్.. ఆ వ్యక్తి గురించి మరోసారి ప్రస్తావించారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..”డబ్బు ఇచ్చి.. ప్రాణం నిలిపిన అతడికి థ్యాంక్స్ చెప్పి పంపలేను. అందుకే నా నంబర్ ఇచ్చి.. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా సంకోచించకుండా ఫోన్ చేయమని చెప్పాను. నా ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు పరంగా అతడికి ఏమైనా సాయం చేశారో లేదో నాకు తెలియదు.
కానీ అతడి మానవత్వానికి డబ్బుతో ముడి కట్టలేను. అతడికి సాయం కావాలంటే మాత్రం ఎక్కడివరకు అయినా వెళ్తాను” అని తేజ్ వెల్లడించాడు. ఇదే సమయంలో తాను అసలు మద్యం సేవించనని సాయి తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజున తాను డైరెక్టర్ దేవా కట్టా ఇంటికి వెళ్తున్నట్లు తెలిపాడు. ఇంకా ఇంటర్వ్యూలో తను తాజాగా నటించిన విరుపాక్ష మూవీకి సంబంధించిన విశేషాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. హీరో సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.