ap cinema ticket prices : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు. రాధేశ్యాం సినిమా విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై జీవో ఇస్తే తాను సంతోషిస్తానన్నారు. కొత్త జీవో ప్రకారం టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ జీవో ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. జీవోకు సంబంధించిన విషయాలు కూడా తనకు తెలియదని, తాను కూడా ఆ జీవో కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. సినిమా టిక్కెట్ల ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇవాళో, రేపో జీవో జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై టిక్కెట్ ధరల నిర్థారణ కమిటి వివిధ స్థాయిల్లో చర్చించింది. జీవో 35తో పోల్చుకుంటే కొత్త జీవోలో చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ధరలు నిర్థారణ జరిగినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లకు ఊరటనిచ్చేలా కొత్త ధరలు ఉండనున్నాయట.
కాగా, ఇప్పటికే సినిమా ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ టిక్కెట్ల ధరల పెంపు విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వీలైనంత త్వరగా జీవో జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అయినప్పటికి ప్రభుత్వం ఇంకా జీవో జారీ చేయకపోవటం సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.