గత మూడు నాలుగురోజుల నుంచి ‘ఆస్కార్’ అవార్డు గురించి తెలుగు సినీ ప్రేమికుల్లో ఒకటే చర్చ. ‘ఆర్ఆర్ఆర్’ని ఆస్కార్ బరిలో ఎందుకు నిలబెట్టలేదు. దీన్ని కాదని గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ని ఎంపిక చేయడానికి కారణమేంటి? ఆ సినిమాలో అంత దమ్ముందా అని తెగ మాట్లాడుకుంటున్నారు. దీనిపై అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నప్పటికీ.. ఆస్కార్ గురించి చాలా హుందాగా స్పందించారు. ప్రస్తుతం హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ తో బిజీగా ఉన్న ఆయన.. ఆస్కార్ వచ్చినా రాకపోయినా తన ఫిల్మ్ మేకింగ్ మారదని, అక్కడి అభిమానులతో చెప్పారు. ఇప్పుడు తెలుగు యంగ్ హీరో నిఖిల్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ని ఆస్కార్ కు పంపకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే… సినిమాలకు అత్యుత్తమ అవార్డు ఉందా అంటే అందరూ చెప్పే మాట ‘ఆస్కార్’. ప్రతి ఏడాది, భారత్ నుంచి ఏదో ఓ చిత్రాన్ని నామినేషన్స్ కి పంపిస్తుంటారు. కానీ ప్రతిసారి కూడా నిరాశ తప్పడం లేదు. ఇప్పుడు అలాంటి గొడవే జరుగుతోంది. భారత ప్రేక్షకులు ఎంతగానే మెచ్చిన ‘ఆర్ఆర్ఆర్’.. ఈసారి ఆస్కార్ బరిలో ఉంటే అవార్డులు కచ్చితంగా వస్తాయని ఓ హడావుడి చేశారు. హాలీవుడ్ స్టార్స్ కూడా పలువురు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈసారి ‘చెల్లో షో’.. భారత్ నుంచి ఆస్కార్స్ కు పంపిస్తున్నామని చెప్పడంతో అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘నాకు ఆస్కార్ పై వేరే అభిప్రాయం ఉంది. చాలామంది ఆస్కార్ ని ఇష్టపడతారు. కానీ నా వరకు ఓ సినిమాకు అతిపెద్ద విజయం అంటే ప్రజల నుంచి ప్రే, ప్రశంసలు పొందడమే. నాకు తెలిసినంత వరకు అదే పెద్ద అవార్డు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు.. ఆర్ఆర్ఆర్ సినిమాను ఆదరించారు. అదే ఆ సినిమాకు పెద్ద విజయం. అలాంటప్పుడు ఇక ఆస్కార్ ఎందుకు? ఫిల్మ్ ఫేర్, జాతీయ అవార్డులు అని మనకే చాలా అవార్డులు ఉన్నారు. నేనైతే ఆస్కార్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇలా అంటున్నందుకు క్షమించండి. అసలు మనకు ఆస్కార్ సర్టిఫికెట్ ఎందుకు? మన సినిమాలు బాగుంటాయి. విడుదలైన అన్నిచోట్ల బాగా ఆడుతున్నాయి. స్పెయిన్ లో ఈ మధ్య ఆర్ఆర్ఆర్ చూశాను. అక్కడ థియేటర్స్ కూడా హౌస్ ఫుల్స్ అయ్యాయి. ప్రపంచమంతా మన సినిమా అభినందిస్తుంటే.. ఇక ఆస్కార్ అవసరం లేదు అని నా ఫీలింగ్’ అని నిఖిల్ చెప్పాడు.
ఇదిలా ఉండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్.. ఈ ఏడాది మార్చిలో థియేటర్స్ లోకి వచ్చింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. రిలీజైన ప్రతిచోటా కూడా ప్రేక్షకుల్ని ఎంతగానే అలరించింది. లాంగ్ రన్ లో దాదాపు రూ.1200 కోట్లపైనే వసూళ్లని సాధించింది. ముఖ్యంగా హాలీవుడ్ స్టార్ నటీనటులు, దర్శకులు కూడా ఈ సినిమాని ప్రశంసిస్తూ ట్వీట్స్ పెట్టారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకే ఆస్కార్ బరిలో ఉంటుందని అందరూ భావించారు. కాకపోతే రియాలిటీలో అది జరగలేదు. మరి ఆర్ఆర్ఆర్-ఆస్కార్ కి పంపకపోవడం.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: అసలు ‘RRR’కి ఆస్కార్ ఎందుకు ఇవ్వాలి? ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన నిజాలు!