ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో టాలీవుడ్ హీరోలంతా ఒక్కొక్కరుగా అదేబాట పడుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, విజయ్ దేవరకొండ.. ఇలా కొంతమంది ఆల్రెడీ పాన్ ఇండియా స్థాయిలో తమ సత్తా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడిదే బాటలో నేచురల్ స్టార్ నాని చేరిపోయాడు. ‘దసరా’ అనే మాస్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న నాని.. టోటల్ లుక్ మార్చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. ఇప్పటికే నాని లుక్ తో దసరా మూవీపై మోస్తరు అంచనాలు సెట్ అయ్యాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. మూవీని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు.
ఇక దసరా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇంకా రిలీజ్ కి టైమ్ ఉన్నప్పటికీ.. ఒక్కో అప్డేట్ అందిస్తూ ఫ్యాన్స్ లో దసరా మూడ్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ సినిమా నుండి ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా మూవీ టీమ్ దసరా టీజర్ రిలీజ్ చేసింది. ఈ సినిమా పీరియాడిక్ విలేజ్ నేపథ్యంలో సాగనుందని అర్థమవుతున్నా.. విజువల్స్ బట్టి చూస్తే.. ఒక ఇంటెన్స్ డ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పక్కా విలేజ్ యాసలో నాని డైలాగ్స్ గూస్ బంప్స్ కలిగిస్తున్నాయి.
టీజర్ అంతా నాని నేరేషన్ లో సాగింది. నాని ఇంటెన్స్ నేరేషన్ కి.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ని మరింత ఎలివేట్ చేస్తూ.. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీర్లపల్లి, చుట్టూ బొగ్గుకుప్పలు, మందు, సిల్క్ స్మిత.. ఇంటెన్స్ యాక్షన్ కలిపి.. దసరా మూవీపై అంచనాలు రెట్టింపు చేసేశాయి. గ్రాండ్ విజువల్స్ లో హీరో నానిని హైలెట్ చేస్తా.. క్లైమాక్స్ షాట్ ఒకటి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. మరోవైపు హీరోయిన్ కీర్తిసురేష్ లుక్ ని ఇందులో రివీల్ చేయలేదు. మరి చూస్తుంటే.. మార్చి 30న దసరా నాని కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. మరి దసరా టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.