ఆర్ మాధవన్ ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. అమ్మాయిలు ఆయనంటే పడి చచ్చేవారు. ఆయన సినిమాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసేవారు. మాధవన్ లాంటి అందగాడు తమ భర్తగా రావాలని కలలు కనేవారు.
ఆర్.మాధవన్ ఈ హీరోకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అభిమానులు కూడా ఉన్నారు. 2000లలో మాధవన్ లవర్ బాయ్ ఇమేజ్‌తో ఓ ఊపు ఊపారు. అమ్మాయిల్లో ఆయనకు సూపర్ క్రేజ్ ఉండేది. ఆయన సినిమా కోసం అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆర్.మాధవన్‌లా కనిపించిన వారిని అమ్మాయిలు తెగ ఇష్టపడేవారు. అలాంటి వాళ్లు ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే చేసేవారు. ఇందుకు చాలా ఉదాహరణ ఉన్నాయి.
తాజాగా కూడా ఓ వ్యక్తి తన జీవితంలో జరిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. మిలింద్ అనే ట్విటర్ ఖాతాదారుడు సోమవారం ఓ ట్వీట్ చేశాడు. అందులో ఓ వైపు మాధవన్ పాత ఫొటో.. మరో వైపు తన పాత ఫొటోలు ఉంచాడు. ‘‘ చాలా మంది ఈ ఫొటో కోసం పడి చచ్చేవారు. మాధవన్ కారణంగా నా ప్రేమ ఫలించింది. నేను కొంచెం మాధవన్‌లా కనిపిస్తానన్న కారణంతో నేను ప్రేమించిన అమ్మాయి.. నాకు ఓకే చెప్పింది. ఇప్పుడు ఆమె నా భార్య’’ అని రాసుకొచ్చాడు. దీనిపై మాధవన్ స్పందించారు. ‘‘ హౌ కైండ్ బ్రో’’ అని అన్నారు. శ్రీరామ్ అనే మరో ట్విటర్ ఖాతాదారుడు ఆర్ మాధవన్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘ గడ్డం ఉన్నా లేకపోయినా.. మీసాలు ఉన్నా లేకపోయినా అందంగా కనిపించే హీరోల్లో మీరు కూడా ఒకరు.
మీకు అన్నీ సెట్ అవుతాయి. మాధవన్ అందగాడు’’ అని రాసుకొచ్చాడు. దీనిపై కూడా మాధవన్ స్పందించారు. ఆయన హ్యాపీ ఎమోజీలను పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై స్పందిస్తున్న నెటిజన్లు.. మాధవన్ అందగాడంటూ.. ఆయన ఏ వేషం వేసినా అందంగా ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయన తీసిన పాత సినిమాలను గుర్తు తెచ్చుకుంటూ సంతోష పడిపోతున్నారు. మరి, ఆర్.మాధవన్ కారణంగా ప్రేమ పెళ్లి చేసుకున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
How kind bro. 🙏🙏🤗 https://t.co/fKp3jZJycT
— Ranganathan Madhavan (@ActorMadhavan) February 27, 2023