సినిమాలు చూడటానికి చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి కానీ దానికోసం ఎంత కష్టపడతారో తెలిస్తే ప్రేక్షకులు కచ్చితంగా అవాక్కవుతారు. ఎందుకంటే షూటింగ్స్ చేసే టైంలో హీరోహీరోయిన్ దగ్గర నుంచి నటీనటుల వరకు కొన్నిసార్లు గాయాలపాలవుతుంటారు. ఆ విషయాన్ని కొన్నిసార్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఫ్యాన్స్ తెగ కంగారూ పడిపోతారు. తమ అభిమాన హీరోకు ఏం జరిగిందో తెలుసుకోవాలని తెగ ఆరాటపడతారు. పెద్దగా ప్రమాదం ఏం లేదని తెలిసి రిలాక్స్ అవుతారు. ఇప్పుడు కూడా అలానే ఓ హీరో గాయపడ్డాడు. అతడే స్వయంగా ఇన్ స్టాలో ఫొటోలు పోస్ట్ చేయడంతో ఈ విషయం రివీల్ అయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళంలో హీరోగా దాదాపు 20 ఏళ్ల నుంచి కెరీర్ కొనసాగిస్తున్నాడు అరుణ్ విజయ్. తెలుగులోనూ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాలో విలన్ గా యాక్ట్ చేశాడు. ప్రస్తుతం కోలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఇతడు.. యాక్షన్ తరహా మూవీస్ ఎక్కువగా చేస్తుంటాడు. ప్రస్తుతం ‘అచ్చం ఎన్బదు ఇల్లైయే’ మూవీ చేస్తున్నాడు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ లో హీరో అరుణ్ విజయ్ తో పాటు మరో వ్యక్తికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అంతకు ముందే మోకాలి నొప్పితో షూటింగ్ చేసినప్పటికీ.. తాజాగా అది ఎక్కువ అయినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన అరుణ్ విజయ్.. కేరళలోని ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోల్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ‘మోకాళ్లకు అయిన గాయానికి ఆయుర్వేద విధానంలో చికిత్స తీసుకుంటున్నాను. ఇది నాలుగోరోజు చికిత్స. త్వరలోనే షూటింగ్ లో తిరిగి పాల్గొంటాను’ అని రాసుకొచ్చాడు. ఇక దీన్ని చూసిన అతడి అభిమానులు.. త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇది చిన్న గాయంలానే కనిపిస్తుంది. కాబట్టి త్వరలో ఈ హీరో.. సెట్స్ లోకి వెళ్లిపోతాడనిపిస్తోంది. మరి గాయపడ్డానంటూ హీరో అరుణ్ విజయ్ పోస్ట్ పెట్టడం మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.