పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇటీవల భీమ్లా నాయక్ తో సూపర్ హిట్ కొట్టిన పవన్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లోనే తొలిసారి వస్తున్న ఈ సోషియోఫాంటసీ చిత్రాన్ని క్రిష్ శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమా చేస్తాడా? లేక సముద్ర ఖనితో రీమేక్ మూవీ చేస్తారా? అనే అనుమానులు ఊపందుకున్నాయి.
కొందరైతే అసలు మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణంలో పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ సినిమానే లేదు అనే ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఈ పుకార్లు జోరందుకోవడంతో స్వయంగా హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. న్యాచురల్ స్టార్ నానీ- నజ్రియా కలిసి నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు.
‘గత రెండ్రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ తో పవన్ కల్యాణ్ సినిమా వస్తుందా? రాదా? అసలు ఉంటుందా? అని చాలా మీమ్స్, చాలా వెబ్ సైట్స్ మాట్లాడుతున్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను.. సినిమా ఎప్పుడున్నా సరే మీరు మళ్లీ మళ్లీ చూసే విధంగా ఉంటుంది. మళ్లీ పదికాలాల పాటు ఆ సీన్లు, డైలాగులు, పాటల గురించి మాట్లాడుకునేలా ఉంటుంది’ అంటూ హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.
Not true Sir @Telugu360 … am all the time available pls have a word with me before u post something !! https://t.co/hHWoBzRwy0
— Harish Shankar .S (@harish2you) June 9, 2022
అయితే భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది క్లియర్ గా చెప్పకపోయినా.. సినిమా మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పేశారు. సినిమా వస్తున్న పుకార్లకు హరీశ్ శంకర్ తన మాటలతో ఫుల్ స్టాప్ పెట్టినట్లైంది. అయితే హరిహర వీరమల్లు తర్వాత సముద్రఖనితో చేస్తాడా? లేక హరీశ్ శంకర్ తో చేస్తాడా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. హరీశ్ శంకర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sensational director Harish Shankar.S about #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/5XeIGvYZzy
— Bhavadeeyudu Tsunami (@HumanTsunamiFan) June 9, 2022