ఒకప్పుడంటే సోషల్ మీడియా ఇంతగా లేదు కాబట్టి సినిమా అప్డేట్స్ అన్నీ రేడియో, పేపర్, టీవీల్లో వచ్చేవి. ఇప్పుడు ఏదైనా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేస్తున్నాయి. క్షణాల్లో వరల్డ్ వైడ్ వైరల్ అయిపోతున్నాయి.
ఒకప్పుడంటే సోషల్ మీడియా ఇంతగా లేదు కాబట్టి సినిమా అప్డేట్స్ అన్నీ రేడియో, పేపర్, టీవీల్లో వచ్చేవి. ఇప్పుడు ఏదైనా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేస్తున్నాయి. క్షణాల్లో వరల్డ్ వైడ్ వైరల్ అయిపోతున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే రూమర్లకు మాత్రం సామాజిక మాధ్యమాలు పుట్టినిల్లుగా మారాయి. ఇక ట్రోల్స్, మీమ్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. పువ్వు పూసింది అంటే కాయ కాసింది.. మేం కోసుకుతిన్నాం, టేస్ట్ అదిరిపోయింది అనే రేంజ్లో గాసిప్స్ వండేస్తుంటారు. ఇప్పుడు ఓ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్, ఓ పాపులర్ హీరోయిన్ రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారు అంటూ పుకార్లు పుట్టించారు. ఇంతకీ ఎవరా హీరోయిన్, సంగీత దర్శకుడు? తెలుసుకుందాం.
జీవీ ప్రకాష్ కుమార్.. ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే మ్యుజీషియన్‌గా, నటుడిగా స్టార్డమ్ తెచ్చుకున్నాడు. తను హీరోగా చేసిన కొన్ని సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. కథానాయకుడిగా 25వ చిత్రం చేస్తున్నాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గానూ ఫుల్ బిజీగా ఉన్నాడు. కోలీవుడ్, టాలీవుడ్లో క్రేజీ ఫిలింస్ లైనప్ చేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఆదికేశవ’, నితిన్ – వెంకీ కుడుముల మూవీతో పాటు దుల్కర్ సల్మాన్ – వెంకీ అట్లూరి సినిమాలు చేతిలో ఉన్నాయి. హీరోగా తమిళంలో ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘డియర్’ చేస్తున్నాడు. మ్యూజిక్ కూడా మనోడే. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్.
తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య తమిళనాట నటిగా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. జీవీకి జోడీగా నటిస్తున్న ‘డియర్’ షూట్ 2022 డిసెంబర్లో స్టార్ట్ అయింది. రీసెంట్గా గుమ్మడికాయ కొట్టేశారు. చిత్రీకరణ పూర్తయిందంటూ తమిళ్ పీఆర్వోలు ట్విట్టర్లో ఓ ఫోటో షేర్ చేశారు. దానిలో హీరో హీరోయిన్ హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఐశ్వర్య పట్టు చీరలో పెళ్లి కూతురిలా, జీవీ పంచెకట్టుతో పెళ్లి కొడుకులా ఉన్నారు. దీంతో వీళ్లిద్దరికీ వివాహం చేసేశారు నెటిజన్స్. ‘అరే, వీళ్లకి పెళ్లి అయిపోయిందా?, సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం తెలిశాక.. ‘ఫస్ట్ చూడగానే అలాగే అనుకున్నాం’ అంటూ నాలుక కరుచుకుంటున్నారు.
GV Prakash and Aishwarya Rajesh’s #Dear film shoot has been wrapped up. pic.twitter.com/PrJz9QdnvT
— Christopher Kanagaraj (@Chrissuccess) August 2, 2023