నందమూరి నటసింహం.. బాలకృష్ణ అభిమానులకు దీపావళి పండుగ అప్పడే వచ్చింది. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పవర్‌ఫుల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం NBK 107. దీపావళి సందర్భంగా సినిమా టైటిల్‌ని ఖరారు చేస్తూ.. టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఇక కర్నూలు సెంటర్ కొండా రెడ్డి బురుజులో NBK 107 టైటిల్‌ను ‘వీర సింహా రెడ్డి’గా ఖరారు చేస్తూ.. పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
వీర సింహా రెడ్డి పోస్టర్ రిలీజ్ సందర్భంగా గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘‘బాలయ్య బాబు సమరసింహారెడ్డి సినిమా విడుదల రోజు జైలులో ఉన్న ఫ్యాన్ సినిమా తీస్తే.. ఎలా ఉంటుందో.. వీర సింహా రెడ్డి సినిమా అలా ఉంటుంది. బాలయ్య ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. సమరసింహా రెడ్డి సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో.. ఈ సినిమా కూడా అలాంటి వైబ్రేషన్స్‌ని ఇస్తుంది. 2023 సంక్రాంతికి వీర సింహారెడ్డి థియేటర్లలో గర్జిస్తాడు. అభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. నేను కూడా వీర సింహా రెడ్డి సినిమా కోసం అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
‘‘సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. మరో 20 రోజులు బ్యాలెన్స్ ఉంది. ఇప్పటికిప్పుడు సినిమాను రిలీజ్ చేసిన బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. వీర సింహా రెడ్డి పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్ అనేది సినిమాలోని ఓ డైలాగ్. ఇలాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. డైరెక్టర్‌గా నా కలను నేరవేర్చిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్‌గారు, రవిగారికి థాంక్స్. వాళ్లు ఎంతో ప్యాషన్‌తో సినిమా చేస్తున్నారు. మా ప్యాషన్‌ను రేపు థియేటర్స్‌లో చూస్తారు’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘వీర సింహారెడ్డి షూటింగ్ కర్నూలులో కొండా రెడ్డి బురుజు దగ్గర చేశాం. ఇది రాయల సీమ కథ.. రాయల సింహం కథ. అందుకనే సినిమా టైటిల్‌ను కూడా అక్కడే కొండా రెడ్డి బురుజు దగ్గరే విడుదల చేశాం అని చెప్పుకొచ్చారు. ‘వీర సింహా రెడ్డి’ మూవీ ఉప శీర్షిక చూస్తే అందులో గాడ్ ఆఫ్ మాసెస్ అని ఉంది. అందుకు తగ్గట్లే.. పోస్టర్‌లో పులిచర్ల అనే ఊరి పొలిమేర దగ్గర బాలకృష్ణ నలుపు చొక్కా ధరించి మైల్ స్టోన్ మీద కాలు పెట్టి రాజసంగా నిల్చుని ఉన్నాడు. పక్కనే గొడ్డలి ఉంది. దీనిబట్టి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం అవుతుంది అంటున్నారు బాలయ్య అభిమానులు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, కన్నడ నటుడు దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ థియేటర్స్‌లో విడుదల కానుంది.