నటి గాయత్రి గుప్తా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు బతకవని డాక్టర్ తేల్చేశారట.
గాయత్రి గుప్తా.. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన తెలుగు నటి. గాయత్రి గుప్తా ఎవరు అని మీరు ఆలోచించవచ్చు. కానీ తను చేసిన సినిమా పేర్లు చెబితే మాత్రం తనా అని అంటారు. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించి తెలంగాణ యాసలో డైలాగ్స్ మాట్లాడుతూ ప్రేక్షకులందరి దృష్టిలో మంచి ఈజ్ ఉన్న నటిగా తను గుర్తింపు తెచ్చుకుంది. గుర్తు పట్టారనుకుంటా? యస్ మీరు అనుకున్న నటినే. తన పేరే గాయత్రి గుప్తా. ఫిదా సినిమాతో పాటు ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఇటీవలే సినిమాల్లో ఆడవాళ్ళ విషయంలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై.. అలాగే బిగ్ బాస్ ప్రోగ్రాంకి సంబంధించిన టీంపై లైంగిక ఆరోపణలు కూడా చేసింది. ఒక దశలో ఇలాంటి బతుకు బతికే కంటే చనిపోదామని నిర్ణయించుకున్నానని తాజాగా గాయత్రి గుప్తా చెప్పిన ఒక మాట సంచలనం సృష్టిస్తుంది.
ఫిదా సినిమా తో పాటు అమర్ అక్బర్ ఆంటోనీ, మిఠాయి, కొబ్బరి మట్టతో పాటు ఇంకొన్ని తెలుగు సినిమాల్లో గాయత్రి గుప్తా నటించింది. తాను పోషించిన క్యారెక్టర్ వరకు గాయత్రి గుప్తా బాగా చేస్తుందనే పేరును సంపాదించుకుంది. ఈ మధ్య తన పర్సనల్ లైఫ్ గురించి అందరితో షేర్ చేసుకుంది. ఆమె మాటలు విని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. గాయత్రి గుప్తాకి యాంక్లోసింగ్ అనే ఒక ఒక వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఒక మనిషి పూర్తి డిప్రెషన్ లో కి వెళ్ళినప్పుడు వచ్చే ఒక శారీరక వ్యాధి. ఈ వ్యాధి గాయత్రికి ఎప్పుడు వచ్చిందో కూడా తనకు తెలియదట. వ్యాధి వల్ల నిద్రపట్టని ప్రతిసారి పెయిన్ కిల్లర్స్ ని వాడేదని, ఆ సమయంలో గాయత్రి విపరీతమైన గుండె దడ వచ్చేదని, బాధ పడేకంటే చనిపోవడం నయం అని గాయత్రి అనుకుందట.
అలాగే చాలా మంది డాక్టర్స్ మూడు సంవత్సరాల క్రితం గాయత్రి గుప్తాతో నువ్వు ఐదు సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం బతకవని చెప్పారు. కానీ సైకాలజీ థెరపీ ట్రీట్మెంట్ వచ్చాక కొంచెం ఉపశమనంగా ఉందని, అలాగే టైంకి నిద్రపోవడం, ఉదయాన్నే యోగా చేయడం మొదలైనవి పాటించడం వల్ల తనకు జీవితం మీద ఆశ పెరుగుతుందని చెప్పు కొచ్చింది. ఈ విషయాలన్నీ గాయత్రి గుప్తా చాలా క్లియర్ గా చెప్పింది. ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సినిమా మీద పిచ్చితో ఇంట్లో నుంచి బయటకు వచ్చి మంచి మంచి కేరెక్టర్స్ ని పోషించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలన్న గాయత్రి గుప్తా ఆశయం ఖచ్చితంగా నెరవేరుతుందని.. అలాగే గాయత్రి గుప్తా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటుందని గాయత్రి గుప్తా గురించి తెలిసిన వాళ్ళందరూ అంటున్నారు.