గత కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి-గరికపాటి నరసింహరావు ల మధ్య ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో చోటుచేసుకున్న సంఘటన.. ఎంత పెద్ద దూమారం రేపిందో మనందరికి తెలిసిందే. ఇక ఈ వివాదంపై పరిశ్రమలోని చాలా మంది స్పందించిన విషయం కూడా మనకు విదితమే. ఈ క్రమంలోనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. గరికపాటి పై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. చిరంజీవిని ఏనుగుతో పోలుస్తూ.. గరికపాటిని గడ్డిపరకతో పోల్చి ట్వీట్ చేసిన వర్మ.. తాజాగా మరో సారి తన నోటికి పని చెప్పాడు. ఈసారి ఏకంగా గరికపాటి అనుష్కను కొంటెగా పొగిడే వీడియోను పోస్ట్ చేసి.. మరో వివాదానికి తెరలేపాడు.
రామ్ గోపాల్ వర్మ.. ముక్కుసూటిగా.. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తిగా వర్మ పేరుగాంచిన విషయం తెలిసిందే. అందుకే అందరు ఆయన్ని దేశంలో భావస్వేచ్చా హక్కుని సంపూర్ణంగా వాడుకునే ఏకైక వ్యక్తిగా వర్ణిస్తారు. తాజాగా గరికపాటి-చిరంజీవి వివాదంలో దూరిన ఆర్జీవీ వరుస ట్వీట్లతో గరికపాటి నరసింహరావుపై విరుచుకుపడుతూనే ఉన్నాడు. నిన్నగాక మెున్న సినీ పెద్దల జోలికి రావొద్దంటూ.. ట్వీట్ చేసిన వర్మ. మెగాస్టార్ ను ఏనుగుతో పోల్చుతూ.. గరికపాటిని గడ్డిపరకతో పోల్చుతూ.. మరో పోస్ట్ చేశాడు. నరసింహరావుకు పద్మ శ్రీ కూడా ఎక్కువేనంటూ విమర్శించాడు. తాజాగా మరో సారి, గతంలో గరికపాటి హీరోయిన్ అనుష్క అందం గురించి కొంటెగా మాట్లాడుతున్న వీడియోని షేర్ చేస్తూ..”మీరు కూడానా బాహు(గరిక)బలి (పాటి) గారు” అంటూ వ్యంగ్యంగా క్యాప్షన్ సైతం ఇచ్చాడు.
ఇంతకి ఆ వీడియోలో ఏముందంటే? “చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను కుర్రకారు తెగ చూస్తుంటారు. నేను అనుకునే వాణ్ణి వారిలో ఏముందిలే అని. ఒక రోజు నేను పేపర్ లో పొలిటికల్ న్యూస్ చదువుతుంటే.. మా అబ్బాయి వచ్చి నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. స్నానం చేశాడు కదా కాళ్లకు దండం పెడదానికి వచ్చాడులే అనుకున్నా! ఏంట్రా అని అడిగితే.. ఠక్కున లేచి వెళ్లాడు. వాడు వెళ్లాక చూస్తే.. అక్కడ అనుష్క ఫొటో ఉంది. స్వతాహాగా కవిని కాబట్టి.. నేనూ ఆ అమ్మాయిని ఎగాదిగ చూశా. నన్నే ఆకర్షించింది అంటే.. ఇక వాడ్ని ఆకర్షించడం ఒక లెక్కా అనుకున్నా. నా పనిలో నేనుంటే.. వాడిపనిలో వాడున్నాడు” అని చమత్కారంగా మరికొన్ని మాటలు కలిపి గరికపాటి అన్నాడు. ఈ వీడియోనే ప్రస్తుతం ఆర్జీవీ షేర్ చేసి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక తనపై ఎన్ని విమర్శలు వస్తున్నాగానీ గరికపాటి ఇంత వరకు స్పందించలేదు.
OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU ! 😜 pic.twitter.com/00rLB4oVj7
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022
OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI GAARU ! 😜 pic.twitter.com/DFsvB9ZrK1
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022