Gajuwaka Lady Conductor: గాజువాక లేడీ కండెక్టర్ పల్సర్ బైక్ డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ఆమె చేసిన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఆమె ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. లేడీ కండెక్టర్ డ్యాన్స్ దుమ్మురేపేసింది అంటూ జనం చర్చించుకుంటున్నారు. తాజాగా, గాజువాక లేడీ కండెక్టర్ ఝాన్సీ సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ డ్యాన్స్ అంటే చిన్నప్పటినుంచి నాకు చాలా ఇష్టం. కానీ, మా ఇంట్లో నాకు సపోర్టు రాలేదు.
డ్యాన్స్ అంటే చిన్నచూపు, అందులోనూ ఆడపిల్ల డ్యాన్స్ చేస్తే బరితెగించేసింది అంటారు. మా అమ్మను నాన్న నా చిన్నప్పుడే వదిలేశారు. తండ్రి లేడు కాబట్టి ఇంట్లో పెద్దదాన్నైన నామీద కుటుంబం బాధ్యత పడింది. నాన్న గారు లేనపుడు గంజన్నం ఆవకాయ తిని బతికా. డ్యాన్స్ కారణంగానే నేను నా తమ్ముడ్ని ఎంబీఏ చదివించుకున్నా. మా అమ్మను పోషిస్తున్నా. మా అమ్మను చాలా మంది తిట్టారు.
‘ ఆడపిల్ల రోడ్ల మీద డ్యాన్సులు చేస్తే మీరు తింటున్నారు’ అని అన్నారు. అప్పుడు తిట్టిన వాళ్లు ఇప్పుడు గర్వంగా పొగుడుతున్నారు. నన్ను తిట్టిన వాళ్లు నా వెనకే ఉన్నారు. నేను ముందున్నా. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కుటుంబాన్ని బయట పడేసి వెళ్లిపోయారు. సంవత్సరం క్రితం చనిపోయారు. ఎంతో కష్టపడి నేను ఆరాధించే చిరంజీవి గారిని కలిశాను’’ అని చెప్పుకొచ్చారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి
ఇవి కూడా చదవండి : Cobra: హాలీవుడ్ సినిమాను తలపిస్తున్న ‘కోబ్రా’ తెలుగు ట్రైలర్.. అదిరింది!