IQ: డెబ్యూ హీరో సాయిచరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం “IQ”. శ్రీ కాయగూరల లక్ష్మీ పతి, శ్రీ కాయగూరల శ్రీనివాసులు నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ప్రసాద్ ల్యాబ్ లో సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కెయస్ రామారవు గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం చిత్రయూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో ముఖ్యఅతిథి ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “సినిమా చిన్నదైనా పెద్దదైనా మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా ప్రేకాకధారణ పొందుతుంది. యూత్ ఫుల్ సబ్జెక్టుతో వస్తున్న ఈ IQ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. హీరో సాయిచరణ్ ని చూస్తుంటే డిజె టిల్లు హీరో గుర్తుకు వస్తున్నాడు. ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ ఈ సినిమా మంచి పేరు రావాలని కోరుతున్నాను” అన్నారు.
నిర్మాత కెయస్ రామారావు మాట్లాడుతూ.. “IQ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రతి సీన్ కొత్తదనంగా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ‘iQ’ అనే టైటిల్ అందరికి అర్థమవ్వడం కష్టం. ఇలాంటి మంచి చిత్రాన్ని దర్శక, నిర్మాతలు ఎంత ఎక్కువగా ప్రమోషన్ చేసుకుంటే అంత మంచిది. మంచి సబ్జెక్ట్తో తీస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి” అన్నారు.
చిత్ర దర్శకనిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. “మేము పిలవగానే వచ్చిన ఏపీ మాజీ మంత్రివర్యులు ఘంటా శ్రీనివాసరావు, ప్రముఖ నిర్మాత కె. యస్. రామారవు తదితర పెద్దలకు ధన్యవాదములు. నాకు మంచి యూనిక్ సబ్జెక్టు లభించడంతో ఈ సినిమా చేస్తున్నాను. యూత్ కు సంబంభించిన మూవీ “IQ”. ఈ చిత్రంలో హీరోయిన్ చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తుంది. మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ చిత్రానికి మంచి నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ చక్కగా కుదిరారు. ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు ఘటికాచలం అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రానికి మీరందరి సపోర్ట్ కావాలని కోరుతున్నాను” అన్నారు. ఇక ఆ తర్వాత హీరో సాయిచరణ్, హీరోయిన్లు పల్లవి, ట్ర్యాన్సీ మాట్లాడుతూ దర్శకనిర్మాతకు ధన్యవాదాలు తెలిపారు. మరి IQ మూవీపై అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.