విశ్వక్ సేన్- యాంకర్ దేవీ నాగవల్లి వివాదం కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు, ఫిర్యాదులతో వాతావరణం వేడెక్కింది. యాంకర్ దేవీ నాగవల్లి మంత్రి తలసానికి ఫిర్యాదు చేయడం, మహిళా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు విశ్వక్ వ్యాఖ్యలను ఖండించడం చకచకా జరిగిపోయాయి. విశ్వక్ ఒక హీరో అయ్యుండి.. బాధ్యత గల మహిళా జర్నలిస్ట్ పట్ల ఆ అసభ్య పదజాలం మాట్లాడటంతో వీరంతా ఇప్పుడు దేవికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. కానీ.., అటు స్టార్ హీరోల నుంచి కానివ్వండి, ఫిలిం ఛాంబర్ నుంచి కానివ్వండి విశ్వక్ సేన్ కు ఎలాంటి మద్దతు లభించలేదు. కనీసం ఒక్కరు కూడా విశ్వక్ సేన్ కు మోరల్ సపోర్ట్ ఇవ్వకపోవడాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, ఫాలోవర్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: విశ్వక్ సేన్- యాంకర్ దేవీ నాగవల్లి గొడవపై నిర్మాత చిట్టిబాబు క్లారిటీ!
విశ్వక్ సేన్- యాంకర్ దేవీ నాగవల్లి మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలుసు. ఒక లైవ్ డిబేట్ లోకి విశ్వక్ సేన్ వెళ్లడం, తనను పాగల్ సేన్ అని పిలవకండని చెప్పడం, ఆ తర్వాత యాంకర్ గెట్ అవుట్ అంటూ ఫైర్ అవ్వడం, వెంటనే విశ్వక్ సేన్ అభ్యంతరకర పదం వాడటం, తర్వాత ఆ వీడియో వైరల్ అవ్వడం, యాంకర్ దేవీ మంత్రి తలసానికి ఫిర్యాదు చేయడం చూశాం. ఇక్కడ ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అనే డిస్కషన్ గురించి కాసేపు పక్కన పెడదాం. తమ యాంకర్ ను తప్పుగా మాట్లాడారని మీడియా, మహిళా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు సైతం గళమెత్తాయి. విశ్వక్ చేసింది తప్పు అని రెండు రోజులుగా తమ వాదన వినిపిస్తూనే ఉన్నారు.
ఈ మొత్తం వివాదం తర్వాత విశ్వక్ సేన్ అభ్యంతరకర పదం మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాడు. కానీ.., ఆ తర్వాత కూడా విశ్వక్ కు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. కనీసం ఏ హీరో, నిర్మాత, యాక్టర్ విశ్వక్ కు మద్దతుగా నిలవలేదు. నిజానికి ఆ వివాదంలో విశ్వక్ ఆ పదం వాడాడు అనే అందరూ మాట్లాడుతున్నారు. కానీ.., ఆ పదం మాట్లాడడానికి దారి తీసిన విషయాల గురించి ఇండస్ట్రీ నుంచి ఎవరూ వాయిస్ వినిపించలేదు. అది కూడా పక్కన పెడితే ఆ వివాదానికి శుభం కార్డు వేయాలని కూడా ఎవరూ చొరవ తీసుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇక్కడితో దీన్ని ఆపేద్దాం అంటూ ఏ ఇండస్ట్రీ పెద్ద ఇప్పటి వరకు ముందుకు రాలేదు.
ఇదీ చదవండి: తనపై జరుగుతున్న చర్చపై మోకాళ్లపై కూర్చుని విశ్వక్ సేన్ ఎమోషనల్!
“విశ్వక్ అసభ్యపదజాలం వాడటం ముమ్మాటికీ తప్పే. కానీ.., అంతకన్నా ముందు అతన్ని పాగల్ సేన్ అని, డిప్రెషన్ పర్సన్ అని సంబోధించారు. ప్రాంక్ ఇష్యూ మీద హీరో దగ్గర క్లారిటీ తీసుకుంటే సరిపోయేది కదా? వారు అలా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. విశ్వక్ కూడా ఆ మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. సినిమా, మీడియా అనేది సమాజానికి ఉపయోగపడే రెండు ప్రధాన రంగాలు. ఈ రెండిటి మధ్య ఇంత వివాదం వద్దు. ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడదాం” అని.. పరిశ్రమ నుండి ఒక వాయిస్ స్ట్రాంగ్ గా వినిపించకపోవడమే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విశ్వక్ స్థానంలో ఇప్పుడు ఏ స్టార్ హీరో అయినా, ఇండస్ట్రీలో ఏ పెద్ద కుంటుంబానికి చెందిన హీరో అయినా ఇలాంటి వివాదంలో ఇరుక్కుంటే..! పరిశ్రమ ఇలానే మౌనంగా ఉండిపోయేదా? సమస్య పరిష్కారానికి కృషి చేసేది కాదా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో విశ్వక్ ను ఇండస్ట్రీ ఏకాకిని చేసిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.