F2: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు మొదలుకొని పాన్ ఇండియా సినిమాల వరకూ విజువల్ ఎఫెక్ట్స్ కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ బాటపడుతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలంటే భారీ స్థాయిలో సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్) అవసరం అవుతుంది. కానీ.. ఇప్పుడు చిన్న సినిమాలలో సైతం అవసరమైన చోటల్లా విజువల్స్ తో మాయ చేసేందుకు మక్కువ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. అయితే.. గ్రాఫిక్స్ ని ఏ స్థాయిలో వాడుకున్నా, అది ప్రేక్షకుల కంటికి బెడిసికొట్టకుండా ఉంటే చాలని అనుకుంటారు.
ఈ క్రమంలో పెద్ద సినిమాలైతే దాదాపు ఆ స్థాయి లొకేషన్స్ ని అందంగా చూపించేందుకు.. ఒళ్ళు గగ్గుర్పొడిచే సన్నివేశాల కోసం విఎఫ్ఎక్స్ వైపు మళ్లుతుంటారు. అయితే.. ఇప్పుడు విఎఫ్ఎక్స్ లేకుండా చిన్న సినిమాలు కూడా తెరకెక్కడం లేదు. కాబట్టి, సినిమాలో ఎక్కడో ఓ చోటైనా వాడినట్లు చెబుతుంటారు. ఇక సినిమా రిలీజై థియేటర్లలో నుండి వెళ్ళిపోయాక, చిత్రబృందం ఆ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్, తెరవెనుక కష్టాలను వీడియో రూపంలో పోస్ట్ చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా 2019లో ‘F2’ సినిమా ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. ఈ సినిమా సిజి వర్క్ కి సంబంధించిన మేకింగ్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎఫ్2 మూవీ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక దానిని కొనసాగిస్తూ ఇటీవల ఎఫ్3 సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. ఎఫ్2 సినిమాలో క్లైమాక్స్ బ్రిడ్జి సీన్స్ ని గ్రీన్ మ్యాట్ తో తెరకెక్కించడం మనం మేకింగ్ వీడియోలో చూడవచ్చు. సినిమాలో కీలకమైన బ్రిడ్జి సీన్ లో.. అందమైన లొకేషన్స్ చూపించేందుకు గ్రాఫిక్స్ ని ఉపయోగించారు మేకర్స్. సరిగ్గా గమనిస్తే.. ఓ పాత బ్రిడ్జిపై తెరకెక్కించిన సీన్స్.. గ్రాఫిక్స్ వర్క్ అయ్యాక ఏ రేంజిలో థియేటర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో.. సినిమా కలెక్షన్స్ బట్టి అంచనా వేయొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఎఫ్2 సినిమా గ్రాఫిక్స్ సీన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.