బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ప్రత్యేక అభిమాలున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు దాటుకుని ఈ స్టేజ్‌కు చేరాడు సుధీర్. పైగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సుధీర్ సొంతం. ఇక స్కిట్‌లో తనపై ఎవరు ఎన్ని పంచులు వేసినా నవ్వుతూ లైట్ తీసుకుంటాడు. పైగా తన మీద తానే పంచులు వేసుకుంటాడు. సుధీర్‌లోని ఈ సింప్లిసిటేనే అతడిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. సుధీర్ చాలా కాలంగా ఈటీవీకే పరిమితం అయ్యాడు. సినిమాల్లో నటిస్తున్నప్పటికి.. బుల్లితెర విషయానికి వస్తే.. కేవలం ఈటీవీలో వచ్చే కార్యక్రమాల్లోనే కనిపిస్తాడు.
ఇది కూడా చదవండి: ఛానెల్ మారిన సుడిగాలి సుధీర్! జబర్దస్త్ కి కూడా?
ఈటీవీలో సుధీర్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కనిపిస్తాడు. గతంలో ఢీ షోలో ఉండేవాడు.. కారణాలు తెలియదు కానీ ప్రస్తుత సీజన్‌లో సుధీర్ ఢీలో లేడు. ఈ మధ్య కాలంలో ఈటీవీలో ప్రసారం అవుతున్న పండగల స్పేషల్ ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా సుధీర్ కనిపంచడం లేదు. దాంతో కావాలనే మల్లేమాల టీం సుధీర్‌ను పక్కకు పెడుతుందనే విమర్శలు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. కానీ మల్లెమాల టీంలో ఎలాంటి మార్పు లేదు. పైగా సుధీర్‌ను వెక్కిరించే ప్రయత్నాలు మానుకోవడం లేదు. తాజాగా జబర్దస్త్ షోలో ఓ స్కిట్‌లో సుధీర్‌ను దారుణంగా అవమానించారు. ఇది చూసిన సుధీర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్‌పై మరీ ఇంత పగ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: హగ్ చేసుకొని రియలైజ్ అయ్యానని సుధీర్ పై ఓపెన్ అయిన రష్మీ!
మార్చి 25 న ప్రసారం కాబోయే ఎక్స్‌టా జబర్దస్త్ షోలో సుధీర్ మీద ఓ స్ఫూఫ్ చేశారు. హోలీ సందర్భంగా సుధీర్-రష్మీ మా టీవీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సుధీర్-రష్మీ తమ బాండింగ్ గురించి మాట్లాడారు. ఇక చివర్లో రష్మీ సుధీర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యి.. దిష్టి చుక్క పెడుతుంది. దీన్ని వెక్కిరిస్తూ.. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో స్కిట్ చేశారు. అంతటితో ఆగకుండా.. గతంలో ఈటీవీలో సుధీర్ రీల్ పెళ్లిల్లు, నిశ్చితార్థాలను కూడా వెక్కిరించారు.
ఇది కూడా చదవండి: సుడిగాలి సుధీర్ పై దారుణమైన ట్రోల్స్! ఫ్యాన్స్ ఫైర్!
ప్రోమోలో ఇవన్ని చూసిన సుధీర్ అభిమానులు మల్లెమాల టీమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్‌పై మాత్రమే ఇంత పగ ఎందుకు.. పండగ ఈవెంట్స్‌లో మీరు సుధీర్‌ను పక్కకు పెట్టారు.. వేరే చానెల్స్ తనని ఆహ్వానించాయి.. దానికి ఇంత వెక్కిరింపు అవసరమా.. అసలు సుధీర్‌పై ఇంత పగ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. మరి దీని మీద కూడా ఏదో ఓ షోలో రిప్లై వస్తుందేమో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Humiliation
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.