నిన్న మొన్నటి వరకు తెలుగు అమ్మాయిలకి గ్లామర్ ఫీల్డ్ లో అంతగా అవకాశాలు రావడం లేదన్న కంప్లైంట్ గట్టిగా వినిపించేది. కానీ.., ఇప్పుడు తెలుగు బుల్లితెరపై మాత్రం లోకల్ పాపలు రచ్చ రచ్చ చేస్తున్నారు. వీరిలో అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జూనియర్ సమంతాలా ఫేమ్ దక్కించుకున్న ఆషు.. ఆ తరువాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి సెలబ్రెటీ అయిపోయింది. ఇలా వచ్చిన క్రేజ్ తో ఈ అమ్మడు ఇప్పుడు కొన్ని ఎంటర్టైన్మెంట్స్ షోలలో మెరుస్తోంది. ఇప్పటికే యాంకర్ రవితో కలసి ‘హ్యాపీడేస్’ అనే డైలీ షోకి హోస్టుగా వ్యవహరిస్తోంది ఈ బొద్దు బ్యూటీ. ఇక దీనితో పాటు.., కామెడీ స్టార్స్‌లో అషు రెడ్డి ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా మారిపోయింది.
వరుస ఆఫర్స్ తో బిజీ అవుతున్న అషు చుట్టూ ఎప్పుడూ లవ్ ఎఫైర్స్ వార్తలు తిరుగుతూనే ఉంటాయి. నిన్న మొన్నటి వరకు అషు రెడ్డి సింగర్ రాహుల్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ.., తమ మధ్య స్నేహం తప్ప మరేమి లేదని వీరు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో అషు రెడ్డి, ఎక్స్‌ప్రెస్ హరి మధ్య కూడా సంథింగ్ సంథింగ్ అన్న వార్తలు పుట్టుకొచ్చాయి.
ఇవి కాస్త శృతిమించడంతో ఈ విషయంపై అషు రెడ్డి వివరణ కూడా ఇచ్చుకుంది. ఎక్స్‌ప్రెస్ హరి నాకు అన్నయ్య లాంటి వాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో.., అషుపై ప్రేమ వార్తలకి ఇంతటితో చెక్ పడినట్టే అని అంతా అనుకున్నారు. కానీ.., తాజాగా కామెడీ స్టార్స్ పోగ్రామ్ లో తాజాగా జరిగిన ఓ సంఘటన అషుతో పాటు, ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది.
కామెడీ స్టార్స్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో అషు రెడ్డి.. ఎక్స్‌ప్రెస్ హరి సరసన ఓ స్కిట్ చేసింది. రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో హరి… అషుని సిన్సియర్ గా ప్రేమించే లవర్ క్యారెక్టర్ చేశాడు. స్కిట్ చేస్తుండగానే హరి నిజంగానే ఎమోషనల్ అయిపోయాడు. అషుని రియల్ గా తాను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియచేస్తూ..,
తన గుండెల పై ఆమె పేరుని పచ్చబొట్టుగా వేసుకున్న విషయాన్ని బయటపెట్టాడు. అదేదో స్కిట్ కోసం వేసుకున్న పచ్చబొట్టు కాదు. నిజంగానే ఆషు రెడ్డిపై ప్రేమతో వేపించుకున్న పచ్చబొట్టు. ఇది తుడిపితే పోదు అని హరి చెప్పగానే.., అషు ముట్టుకుని చూసి షాక్ అయ్యింది. ఇలా ఎందుకు చేశావు అంటూ ఎక్స్ ప్రెస్ హరి చెంపపై ఓ దెబ్బ కూడా కొట్టేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.